స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గతవారం రోజులుగా ఎండలు జోరందుకోవడంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వాయువ్య దిశ నుండి తెలంగాణ వైపు వీస్తున్న వేడి గాలులు వీస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో పాటు ఈశాన్య జిల్లాలలో 43 నుంచి 44 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టు ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.


