స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ముగిసింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తూనే ఉంది. మొత్తానికి 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో కొంతమంది ప్రముఖులు ఓడిపోవడం గమనార్హం.
ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. బీజేపీ మంత్రులు బీసీ పాటిల్, గోవింద కరజోల, డాక్టర్ కే సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బీ శ్రీరాములు, నారాయణ గౌడ, మురుగేశ్ నిరానీ పరాజయం మూటగట్టుకున్నారు. ఇక జేడీఎస్ అధినేత కుమారస్వామి తనయుడు హీరో నిఖిల్ కుమారస్వామి కూడా ఓడిపోయారు.