స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: TSPSC పేపర్ లీకేజీ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక రాథోడ్ బెయిల్‌పై కాసేపటి క్రితం విడుదలైంది. రేణుక తరఫు న్యాయవాదులు చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ ఆర్డర్ కాపీ అందించడంతో అధికారులు రేణుకను విడుదల చేశారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ అధికారుల ముందు హాజరుకాలని, పాస్ పోర్ట్ సమర్పించాలని బుధవారం షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో మార్చి 13న బేగంబజార్ పోలీసులు రేణుకతో పాటు మిగతా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రేణుక చంచల్ గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే రేణుక బెయిల్ పై విడుదల కావడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో ఆడుకున్న ఇలాంటి వారికి బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.


