స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తర్వాత ప్రజలను భయపెట్టిన మంకీపాక్స్ వ్యాధిపై ఉన్న హెల్త్ ఎమర్జెన్సీని ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలగించింది. ఇక నుంచి మంకీపాక్స్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రకటించారు. స్వలింగ సంపర్కం ద్వారా ఈ వ్యాధి 100కు పైగా దేశాల్లో 70,000 కన్నా ఎక్కువ మంది వ్యాపించింది. ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వ్యాపించడంతో WHO ఎమర్జెన్సీ ప్రకటించింది.
గతేడాది మే నెలలో బ్రిటన్ దేశంలో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే కేసులు తగ్గడంతో ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కాగా ఇటీవల కోవిడ్-19 మహమ్మారిపై కూడా అత్యవసర పరిస్థితిని తొలగించిన సంగతి తెలిసిందే.