స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిశాక రాజకీయ నేతల చూపు ఇప్పుడు తెలంగాణ పై పడింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటినుంచే అధికార పార్టీతో పాటు, ప్రతిపక్షాలు కూడా ఎన్నికలపై నజర్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పూర్వవైభవాన్ని పొందేందుకు కాంగ్రెస్ అనేక వ్యూహాలు, వినూత్న ఐడియా లతో ముందుకు వస్తుంది. నిరుద్యోగులను, రైతులను దృష్టితో పెట్టుకొని పథకాలతో ముందుకు వస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ బడా నేతలు తెలంగాణకు పయనమయ్యారు. జూన్ మొదటి వారంలో హైదరాబాద్‌కు సోనియా, రాహుల్, ప్రియాంక రాబోతున్నారు. బోయిన్‌పల్లిలో గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డు భవనానికి అనుమతిచ్చింది. ఇక అదే రోజు 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ అందజేయనున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ పై కాంగ్రెస్ అగ్రనేతలు విరుచుకుపడేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.