స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. మంగళవారం వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ ఇవాళ వంటమనిషి లక్ష్మీదేవి కుమారుడు ప్రకాశ్‌ను విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు లేఖ దాచిపెట్టడంపై అధికారులు పీఏ కృష్ణారెడ్డితో కలిపి ప్రకాశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. లేఖను కృష్ణారెడ్డి ద్వారా ప్రకాశ్ రెడ్డి దాచిపెట్టాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కూపీ లాగే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలను విచారించిన అధికారులు వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిలను కూడా సీబీఐ మరోసారి ప్రశ్నించింది.