స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కార్మికుల దినోత్సవమైన మేడే రోజున పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల 474 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అలాగే ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వేతనాల పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీచేశారు. నూతన సచివాలయంలో మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వేతనాలు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.