Janasena | వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా నినాదం అని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం చంద్రబాబుతో పవన్ చర్చించిన విషయాల్లో ఇదే కీలకమైన అంశమని అన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని చర్చలు ఉంటాయని అన్నారు. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తుందని అన్నారు సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని.. రాష్ట్రంలో లా&ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని నాదెండ్ల వ్యాఖ్యానించారు. జనసేన అధికారంలోకి వచ్చాక.. లా అండ్ ఆర్డర్ ని రక్షిస్తామని తెలిపారు.