12 ఏళ్ళ వయసులోనే ఇంటర్ పూర్తి చేసిన యూపీ విద్యార్థి

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూకి చెందిన ఓ విద్యార్థి అద్భుత ప్రతిభ చాటుతున్నాడు. 12 ఏళ్ళ వయసులోనే ఇంటర్ పూర్తి చేసి అబ్బురపరుస్తున్నాడు. సాధారణంగా ఇంటర్ కంప్లీట్ చేయాలంటే కనీసం 17 సంవత్సరాలు ఉండాలి.. కానీ ఈ విద్యార్థి 12ఏళ్లకే ఇంటర్ పాసై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఏడు, ఎనిమిది తరగతుల్లో ఉండాల్సిన వయసులో ఇంటర్ పాసవ్వటం గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షా ఫలితాలను యూపీ విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అతి తక్కువ వయసులో ఇంటర్మీడియట్​ను పూర్తి చేసి ఆదిత్య శ్రీకృష్ణ(12) రికార్డు నెలకొల్పాడు.

ఎల్డెకో ఉద్యాన్ II కళాశాల ద్వారా పరీక్షలు రాసిన ఆదిత్య 54.4% ఉత్తీర్ణతతో పాసయ్యాడు.ఆదిత్య కాలేజీకి వెళ్లి కాకుండా.. ఇంట్లో ఉండే పరీక్షలకు సిద్దమవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే రాష్ట్రం నుంచి అతిచిన్న వయసులో(13 ఏళ్లకే) సుష్మా వర్మ అనే విద్యార్థి ఇంటర్​ పూర్తి చేయగా… ప్రస్తుతం ఈ రికార్డును ఆదిత్య శ్రీకృష్ణ బ్రేక్​ చేశాడు. అయితే ఆదిత్య శ్రీకృష్ణ మాత్రం.. భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది తన లక్ష్యమని తెలుపుతున్నారు. ప్రస్తుతం దీనికోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. తనకు ఎకానమిక్స్​ సబ్జెక్ట్​ అంటే చాలా ఇష్టమని… అలాగే ఆర్థిక పరమైన అంశాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతానన్నారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్