వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ పోలీసులపై చేయి చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని షర్మిలకు ముందే చెప్పినా.. ఆమె తమ ఆదేశాలు పట్టించుకోకుండా వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీంతో ఆమెను అక్కడికి వెళ్లకుండా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో వారిపై షర్మిల దాడి చేశారని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ పై షర్మిల తల్లి విజయమ్మ కూడా చేయి చేసుకున్నారని సీపీ ఆనంద్ వెల్లడించారు.