దేశంలో 85 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ సరఫరా అవుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. థర్మల్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్తువులను నిషేధించే పనిలో ప్రపంచ దేశాలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో మన దేశానికి థర్మల్ పవర్ అంశం ఒక చాలెంజ్‌గా మారనుందని చెప్పారు. రానున్న రోజుల్లో రెనోబుల్ ఎనర్జీకి మారాల్సి ఉంటుందని ప్రధాని చెప్పినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. విద్యుత్ ఉపయోగం విచ్చలవిడిగా జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.