Covid Cases in India | దేశంలో కొత్తగా 5874 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది కరోనా నుంచి కోలుకోగా… 49,015 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,31,533 కి చేరింది. గత 24 గంటల్లో 8,148 మంది వైరస్ నుంచి బయటపడగా… 25 మంది మృతి చెందారు. ఇందులో కేరళలోనే 9 మంది చనిపోయారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31 శాతం.. రికవరీ రేటు 98.71 శాతం… మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.