కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించా రు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2వేల 400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారని ఆయన వివరించారు.


