స్వతంత్ర వెబ్ డెస్క్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ ముంబై ప్రాతంలోని ధారావి స్లమ్ ఏరియాలో ఏడూ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక నెల వయసు ఉన్న బాబుతో సహా 32మంది గాయపడ్డారు. ఒక నెల వయస్సు ఉన్న బాలుడితో సహా క్షతగాత్రులందరినీ వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చారు. ఇద్దరు సీనియర్ సిటిజన్లు సియోన్ ఆసుపత్రిలో చేరగా, మరికొందరు ఆయుష్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. 90 ఫీట్ల రోడ్‌లో ఉన్న షామా భవనంలో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 80 మంది వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో భవనం మొత్తం కాలి బూడిద అయిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిమాపకశాఖ, పోలీసులు, ముంబై మున్సిపల్ అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.