స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ప్రభుత్వంలో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ వీరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడి, ఆర్‌బి.తిమ్మాపూర్, బి.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి. సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ, సుధాకర్, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కెఎన్.రాజన్న, కె. వెంటకేశ్, హెచ్‌సీ మహదేవప్ప, బైరతి సురేష్ ఉన్నారు. ఈ 24 మందిలో తొమ్మిది మంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. కాగా ఈనెల 20వ తేదిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.