23.6 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

2024 ఎన్నికల్లో పలమనేరు సీటు నుంచి పోటీ చేసేది ఎవరు ?

      ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారిందా అంటే అవునన్న సమాధానమే విని పిస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి పోగా… మరికొందరు మాత్రంవివిధ రకాల కారణాలతో పోటీ విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో ఆ సీటు హాట్‌టాపిక్‌గా మారింది. తాను పోటీ చేయాలంటే గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల డబ్బులు చెల్లిస్తే తప్ప ససేమీరా అంటున్నారు ఆ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ఆయన ఎందుకిలా అన్నారు.. అసలు సమస్య ఎక్కడ వచ్చింది..ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?

      ఇప్పుడు చెప్పుకున్నదంతా దీని గురించే. చిత్తూరు జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి పలమనేరు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు ఎమ్మెల్యే వెంకటే గౌడ. ఇంతవరకు బాగానే ఉన్నా… రానున్న ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారా లేదా అంటే ఆయనకు ప్రత్యామ్నాయంగా ఇంకెవరైనా బరిలో దిగుతారా అంటే ఇప్పుడే చెప్పలేమంటోంది కేడర్. రాష్ట్రంలో ఇప్పటికే వైనాట్ 175 అంటూ ముందుకెళుతున్న వైసీపీకి.. నియో జకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పుల వ్యవహారం తలబొప్పి కట్టేలా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా నియో జకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ? ఎవరు వెనుకంజలో ఉన్నారు.. ఇలా ఎన్నో లెక్కలు, సర్వేలు చేస్తున్న తాడేపల్లి పెద్దలు అందుకు తగినట్లుగానే మార్పులు, చేర్పులతో ఇన్‌ఛార్జ్‌ల జాబితాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు జాబితాలు విడుదలయ్యాయి. అయితే.. ఈ జాబితాలో చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం పేరు లేకపోవ డంతో అక్కడ ఉన్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే.. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం పేరు లేకపోవడానికి కారణం అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉండడమే కారణమ న్న వాదన విన్పిస్తోంది. మరోసారి తాను ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే గతంలో చేసిన పనులకు సంబం ధించిన బిల్లుల నిధులు సుమారు 50 కోట్ల వరకు ఉండడంతో వాటిని విడుదల చేస్తేనే తాను పోటీ చేస్తానంటూ అధిష్టానంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడ తేల్చి చెప్పారన్న వాదన బలంగా వినిస్తోంది.

      ఇటీవలె సీఎం జగన్‌తో సమావేశమయ్యారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు. అయితే.. ఈ చర్చ అంతా సాగిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివా సులు చెప్పడంతో ఒక్కసారిగా పలమనేరు నియోజకవర్గ రాజకీయం హాట్‌హాట్‌గా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అయితే.. దీనిపైనే భిన్న వాదనలు విన్పిస్తున్నారు నియోజకవర్గ నాయ కులు, నేతలు. మరోవైపు..ఇప్పటికే ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం నియోజక వర్గంలో సర్వాత్రా వ్యక్తమవుతోంది. పైగా ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు సైతం ఉన్నాయి. గతంలో సొంత మండ లంలోనే ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ మధ్య ప్రోటోకాల్ విషయంలో పెద్ద ఎత్తున రగడ జరిగింది. దీంతో నాటి నుంచీ ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అధికారులు తలలు పట్టుకున్న సందర్భాలున్నాయి. కొన్నిచోట్ల అయితే ఏకం గా రెండు శిలాఫలకాలతో ప్రోటోకాల్ పాటిస్తూ ప్రారంభోత్సవాలు జరిపిన ఘటనలు సైతం నెలకొన్నాయి. మరోవైపు. .సొంత మండలానికి ఎమ్మెల్యే ఏమి చేయలేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి తోడు పార్టీ కోసం కష్టప డిన సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

         ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎమ్మెల్యే కేవలం తన అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు మొదటి నుంచీ విన్పిస్తున్నాయి. తాజాగా తమ వద్ద నుంచి అక్రమంగా మైనింగ్ లాక్కున్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన జనార్దన్ గౌడ్ కేసు వేయడం.. అందులో భాగంగా ఆయన కోర్టుకు హాజరవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనితోపాటు ఇసుక, మట్టి మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తన అనుచరులకు కట్టబెట్టి కొండ ప్రాంతంలో ఉన్న భూములను పేదవాళ్లకు ఎమ్మెల్యే పంచిపెట్టారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరోవైపు.. సొంత మండలంలో వైసీపీ నాయకులే మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకోవడం పై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో.. అప్పట్లోనే మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే వెంకటే గౌడను పిలిచి క్లాస్‌ పీకా రన్న గుసగుసలు విన్పించాయి. అదే సమయంలో ఏమాత్రం అనుభవం లేని వారికి ఎమ్మెల్యే కొన్ని కీలక పదవులు కట్ట బెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఉన్న మైనస్‌లు చాలవా అన్నట్లుగా ఒక్కో మండలంలో గ్రూపు రాజకీయాలు ఉండడం వైసీపీకి మైనస్‌ అనే చెప్పాలి. వీ కోటలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఒక గ్రూప్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్ ఒక గ్రూప్. మండల పార్టీ అధ్యక్షుడు బాల గుర్నాథ్ ఒక గ్రూప్. కేవలం ఇక్కడే కాదు.. ఇలా ప్రతి మండలాల్లో ఉన్నాయి. రెడ్డమ్మ కృష్ణమూర్తి, మండి సుధా విజయభాస్కర్ రెడ్డి,హేమంత్ రెడ్డి ఇలా పలువురు స్థానిక నేతలతో ఎమ్మెల్యేకు దూరం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎమ్మెల్యే సీటు వెంకటే గౌడకు కట్టబెడు తుందా లేదంటే జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులుకు ఇస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. వీరిద్దరూ కాదంటే.. ఇటీవలె పార్టీలో చేరిన ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్న వాదన కొత్తగా బయలుదేరింది. అయితే… వీటిలో ఏది జరిగినా గ్రూపు తగాదాల కారణంగా పలమనేరులో ఈసారి అధికార వైసీపీకి భంగపాటు తప్పదంటున్నారు మరికొందరు. మరి ఈ సమస్యను వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరించబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్