వంగవీటి, కథానాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్,అక్షర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ధమాకా, పరంపర, 9 అవర్స్, ‘మంగళవారం’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీతేజ్. ప్రస్తుతం ‘పుష్ప`2 వంటి పలు ప్రముఖ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రీతేజ్ తాజాగా తన కెరీర్ గురించి మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా శ్రీతేజ్ మాట్లాడుతూ… ‘‘ఇటీవల విడుదలైన ‘మంగళవారం’ సినిమా ఘన విజయం సాధించి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో గురజ రోల్‌కు నన్ను ఎంచుకున్నందుకు దర్శకులు అజయ్ భూపతి గారికి థ్యాంక్స్. అలాగే నిర్మాత సురేష్‌గారు, స్వాతి గార్లకు కూడా ధన్యవాదాలు. ఈ రోల్ గురజ గురించి చెప్పినప్పుడు డిఫరెంట్ వేరియేషన్స్ అనుకున్నాము. ఈ పాత్ర గురించి వినగానే నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను. మరో కొత్తరం పాత్రను చేసే అవకాశం దొరికింది అని హ్యాపీగా ఫీలయ్యాను. ఇపుడు సినిమా సూపర్‌హిట్ కావడంతో ఆ సంతోషం డబుల్ అయ్యింది. యూనిట్ అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.
రవితేజ గారి ‘రావణాసుర’లో దేవరాజ్ రోల్ చేశాను. నాకు మంచి రోల్ ఇచ్చినందుకు సుధీర్‌వర్మ, నిర్మాత అభిషేక్ గారికి, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మాస్ మహారాజా రవితేజ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను . ఇదే సంవత్సరం నేను నటించిన ‘దళారి’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. నిర్మాత వెంకట్ గారికి, దర్శకులు గోపాల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 2023 నాకు చాలా సంతోషాల్ని ఇచ్చింది. ఎంతో సంతోషంగా గడిచింది.
2024లో హీరోగా నేను నటిస్తున్న ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్ జీ`5లో స్ట్రీమింగ్ కాబోతుంది . అలాగే మరో చిత్రం “ర్యాంబో”. నా రాబోయే చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని అన్నారు.