22.8 C
Hyderabad
Tuesday, March 17, 2026
spot_img

140 కోట్ల మంది నా కుటుంబమే – ప్రధాని మోదీ

      2024 ఎన్నికలే బీజేపీ లక్ష్యంగా దూసుకుపోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లను సాధించి చరిత్ర సృష్టించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో.. మరోసారి మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రధాని మోదీకి కుటుంబం లేదని ప్రతిపక్ష నేత లాలు ప్రసాద్ యాదవ్ హేళన చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న మోదీ అభిమానులు, బీజేపీ నేతలు తామంతా మోదీ కుటంబమే అంటూ ట్వీట్ చేస్తున్నారు.

      మరోవైపు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరి అలాగే బీజేపీ ఎంపీలు, కీలక నేతలు తమ ట్విట్టర్ ఖాతాలో వారి పేరు పక్కన మోదీ కా పరివార్ అని చేర్చుకున్నారు. దీంతో అనేకమంది బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీకి సపోర్ట్‌గా మోదీ కా పరివార్ ట్యాగ్ లైన్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఇదిలా ఉంటే.. అదిలాబాద్‌లో బీజేపీ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ… తనకు పరివారం లేదని కొందరు అంటున్నార ని… దేశంలోని 140 కోట్ల మంది తన కుటుం బమే అంటూ స్పష్టంచేశారు. వారి కోసమే తాను ఇంటిని వదిలి బయటకు వచ్చాననిఆయన చెప్పుకొ చ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్