స్వతంత్ర వెబ్ డెస్క్: జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మే 29, సోమవారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం, నేటి 12 రాశుల శుభ, అశుభ ఫలితాలు.
మేషం
ప్రయత్నకార్య సిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఆర్ధిక విషయంలో పురోగతికి ఊహించని అవకాశాలు పొందవచ్చు. విధేయత, నిజాయితీ వల్ల మరింత శక్తివంతమైన సంబంధాలు ఏర్పడతాయి. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.
కలిసొచ్చే రంగు- తెలుపు
లక్కీ నెంబర్ – 1
వృషభం
ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కెరీర్‌కు సంబంధించి స్థిరంగా ఉండాలి, దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి పెట్టాలి. లక్ష్మీఆరాధన మంచిది.
కలిసొచ్చే రంగు- మెరూన్
లక్కీ నంబర్ – 5
మిథునం
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. ఈ రోజు సన్నిహితులతో నమ్మకాన్ని ఏర్పరచుకోవడం చాలా అవసరం. ఆర్థిక ఒడిదొడుకులు ఉండవచ్చు. వృత్తిపరమైన పురోగతికి అవకాశాలను స్వీకరించాలి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
కలిసొచ్చే రంగు- మెజెంటా
లక్కీ నంబర్ – 6.
కర్కాటకం
శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.పెట్టుబడి విషయానికి వస్తే, మీరు వివేకంతో వ్యవహరించాలి, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. సహజ సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా పనిలో విజయం సాధించవచ్చు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా దేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
కలిసొచ్చే రంగు- హనీ బ్రౌన్
లక్కీ నంబర్ – 7.
సింహం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల ఉండవచ్చు. నాయకత్వ సామర్థ్యాలు మీరు కెరీర్‌లో విజయం సాధించడంలో సహాయపడవచ్చు. గోసేవ చేస్తే మంచిది.
కలిసొచ్చే రంగు- గ్రీన్
లక్కీ నంబర్ – 2.
కన్య
మంచి ఫలితాలున్నాయి .బంధువుల సహకారం అందుతుంది. ఎవ్వరితోనూ గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. మీరు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి అవకాశాలు పొందవచ్చు. శ్రద్ధ, కృషి.. పనిలో విజయాన్ని తెస్తాయి. ఈరోజు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
కలిసొచ్చే రంగు- బ్లూ
లక్కీ నంబర్ – 4.
తుల
అనుకూల ఫలితాలున్నాయి. సంపాదనలో సానుకూల వృద్ధి, స్థిరత్వం ఏర్పడవచ్చు. మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో టీమ్ వర్క్, సహకారం ఉండాలి. శత్రువులపై ఎట్టకేలకు మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధను, మానసిక క్షోభను కలిగిస్తాయి. లింగాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కలిసొచ్చే రంగు- పింక్
లక్కీ నంబర్ – 8.
వృశ్చికం
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరిని ఆకర్షిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మార్పును అంగీకరించడం, అనువైనదిగా ఉండటం.. పనిలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
కలిసొచ్చే రంగు- పీచ్
లక్కీ నంబర్ – 3.
ధనస్సు
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలున్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మీరు పాజిటివ్ గ్రోత్, ఊహించని ఆర్థిక అవకాశాలను పొందవచ్చు. జీవితంపై మీ సానుకూల దృక్పథం, మీ కెరీర్ గ్రోత్‌కు సహాయపడుతుంది. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.
కలిసొచ్చే రంగు- పసుపు
లక్కీ నంబర్ – 5.
మకరం
పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. ఆర్థిక భద్రత, విస్తరణను ఆనందించవచ్చు. మీ కెరీర్‌లో విజయం సాధించడానికి హార్డ్ వర్క్, క్రమశిక్షణపై దృష్టి పెట్టాలి. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలనీ చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
కలిసొచ్చే రంగు- గ్రీన్
లక్కీ నంబర్ – 8.
కుంభం
సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక మార్పులు, వృద్దికి అవకాశాలను అందుకోవచ్చు. ప్రత్యేకమైన ఆలోచనలు మీ కెరీర్‌లో విజయాలకు దారితీస్తాయి.స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్ఠకం చదవండి.
కలిసొచ్చే రంగు- గోల్డ్ కలర్
లక్కీ నంబర్ – 1.
మీనం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. ఏకాగ్రతతో ఉంటే.. ఆర్థిక స్థిరత్వం, వృద్ధి మీకు సాధ్యమవుతుంది. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.
కలిసొచ్చే రంగు- గోధుమ రంగు
లక్కీ నంబర్ – 5.