Telangana: రాష్ట్రంలో ఈరోజు పదవ తరగతి పరీక్ష జరుగుతున్న క్రమంలోనే ఓ ప్రశ్నాపత్రం లీక్ అయింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్ ప్రశ్నపత్రాన్ని ఫొటోతీసి వాట్సాప్ లో పెట్టడంతో క్షణాల్లో అందరికి షేర్ అవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. క్షణాల్లోనే ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంఏంటని అందరూ నోరెళ్ళబెట్టుకుంటే.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పరీక్షా రద్దవుతుందేమో అన్న భయం పట్టుకుంది.
అయితే ప్రశ్నపత్రం లీక్ పై అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. పేపర్ లీక్ కు కారణమైన నలుగురిని ఇప్పటికే విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న ఈ భయానక పరిస్థితిపై విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదని వెల్లడించింది. దీనిపైనా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపింది. బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలిచినట్లు ఆమె తెలిపారు.