18.7 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

హైదరాబాద్ లో 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలు

      ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో పాటు రోడ్ సేఫ్టే పై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను ప్రారం భించారు. వివాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు, ప్రమాదాలకు గురైన వారికి సత్వర సాయం అందించేందుకు ఈ ట్రాఫిక్ మొబైల్ వాహనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి.

     హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై నగర సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గొడవలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే సత్వర సహాయం అందించేందుకు 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను సీపీ ప్రారంభించారు. నగర కమిషనరేట్ లో విద్యార్థులు, యువతీ, యువకులు, ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు….ఇలా ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు నగర కమిషన రేట్ పరిధిలో 150 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దాదాపు 35 వేల మంది పాల్గొన్నారు. హైదరాబాద్ రోడ్డు సేఫ్టీ మాసోత్సవం 2024లో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

         నగరం నలుమూలల ఈ 108 ట్రాఫిక్ మొబైల్ బైకులు సంచరించనున్నాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారికి ఈ ట్రాఫిక్ మొబైల్ పోలీసు సిబ్బంది తక్షణ సాయం అందించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసు శాఖ ఉన్నతాధికారులు చేపట్టారు. సీపీఆర్, ప్రథమ చికిత్సపై ట్రాఫిక్ మొబైల్ పోలీసులకు వైద్యులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ట్రాఫిక్ పై సంపూర్ణ అవగాహన ఉన్న పోలీసులకు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా సేవలు అందించగలిగేవారికి మాత్రమే ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాల బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలోని రోడ్లపై ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా, వయోలేషన్ జరిగినా క్విక్ రియాక్షన్ టీం మాదిరి మొబైల్ పోలీసులు సేవలు అందిస్తారని నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ తప్పక ఫాలో అవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ హెచ్చరించారు.

     పార్కింగ్ ఆక్రమణలకు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే…బడా బాబులు, సామాన్యులు అనే ఏ తేడా లేకుండా…అందరికి చలనాలు వేస్తామని ఆయన చెప్పారు. గూడ్స్ వెహికిల్స్ వల్ల ట్రాఫిక్ పెరిగిపో తోందని, కేటాయించిన సమయంలో మాత్రమే గూడ్స్ వెహికిల్స్ రావాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ పై కొత్త రూల్స్,రెగ్యులేషన్లు తేబోతున్నామని తెలిపారు. టెరిఫిక్ ట్రాఫిక్ కు చెక్ పెట్టడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ చర్యలతో రద్దీలేని నగరంగా హైదరాబాద్ మారబో తోందని ఆయన తెలిపారు. డ్రైవింగ్ చేసేవారు ధైర్యంగా బండ్లు నడపాలని, భయపడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలకు గురికావచ్చని సీపీ అన్నారు. అయితే, ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ చేస్తే మాత్రం..ప్రమాదాలు సంభవి స్తాయని, ఈ రీతిన ఎవరైనా ప్రవర్తిస్తే..ఆ వాహన చోదకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ అనేది జీవనది లాంటి దని, పోలీసు శాఖ నిరంతరం నదిలాగే కష్టపడుతూ.. ప్రజలకు సేవలు అంది స్తుందని తెలిపారు. ప్రతి నిత్యం వేలాది వాహనాలు రోడ్డుపైకి వస్తూంటాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్ర మిస్తే అది ఆ వ్యక్తులకు, ఇతరులకు చేటే అవుతుంది. అందుకే అందరూ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితం గా పాటించి రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ట్రాఫిక నియంత్రణ చర్యలు చేపట్టనుండడంతో… రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టవచ్చని నగర ప్రజలు భావిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్