శరవేగంగా అభివృద్ధి చెందిన గగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తానికి మెగా ప్లాన్ కు రంగం సిద్దమైంది.నగర అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 2050 నాటికి మెగా ప్లాన్ రూపకల్పనకు యోచన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు హైదారాబాద్ మహానగరం అభివృద్ధి వరకే బృహత్తర ప్రణాళికలు వేశారు. కానీ తాము నగరానికి పరిమితం కాదలుచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవానికి తెలంగాణ మొత్తం సాంస్కృతిక నగరం లాంటిదని. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతంగా పట్టణీకరణ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు అమలైతే హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు ఒక ఖమ్మం మినహా ఎక్కడికైనా కేవలం రెండుమూడు గంటల్లో చేరుకోవచ్చన్నారు.ఈ నేపథ్యంలో రింగురోడ్డ్ మొత్తం రైలు వసతి కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇదిలాఉంటే హైదరాబాద్ నానక్ రాంగూడలో క్రెడాయ్ ఇచ్చిన 17 కోట్లతో నిర్మించిన అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం సీఎస్ఆర్ కింద రూ. 1.5 కోట్లతో సనత్ నగర్ లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఆసుపత్రి సీఎండీ డాక్టర్ బి. భాస్కరరావును సీఎం అభినందించారు. అయితే ఓఆర్ఆర్ లోపల వరకు అర్బన్ తెలంగాణ … ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు పెరి అర్బన్ తెలంగాణ..ఆర్ఆర్ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ విడగొట్టి అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రపంచంలో ఎలాంటి వస్తువు కావాలన్నా చైనా మార్కెట్ లో దొరికేలా సిటీలను అభివృద్ధి చేశారు …తెలంగాణలో కూడా అలాగే అభివృద్ధి చేయాలనుకున్నట్టు తెలిపారు దాదాపు పదిహేను శాటిలైట్ టౌన్‌షిప్‌లను పెద్ద ఎత్తున చేపట్టడంతోపాటు మౌలిక వసతుల రంగాన్ని ప్రోత్సహించాలనేది తమ విధానం సీఎం చెప్పారు. ఫార్మా సిటీని తరలిస్తున్నట్టు పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. ఫార్మా సిటీల స్థానంలో ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి కూత వేటు దూరంలో బల్క్ డ్రగ్ ఫార్మా రెడ్ జోన్ పరిశ్రమలు స్థాపిస్తే భూగర్భ జలాలన్నీ కాలుష్యంతో నిండిపోతాయని ..దీంతో మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఇలాంటి పరిశ్రమలను అమెరికా ఇతర ప్రాంతాలకు తరలించారు … ఫార్మాసిటీ ప్రాంతంలోని దాదాపు 25 వేల ఎకరాల్లో నూతన నగరం నిర్మించాలని … పర్యాటక, విద్యుత్ బ్యాటరీలు, ఆరోగ్య, ఐటీ , కాలుష్య రహిత ఫర్మా క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలనేది తమ యోచనగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయతే హైదరాబాద్ చుట్టూ 14 జాతీయ, రాష్ట్ర రహదారులకు 2-3 వేల ఎకరాల విస్తీర్ణంలో పది పదిహేను కంపెనీలతో ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది.
ప్రజా ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మెట్రోను నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణ వసతులు కల్పించేలా ప్రతిపాదన జరిగింది. ఇదే మాదిరి నగరంలో మరిన్ని ప్రాంతాలకు రైలు సేవలు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ప్రభుత్వం యోచనలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహహాకారం లభిస్తుందని చెప్పారు.. పరిపాలనా వ్యవహారాలు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు . ప్రాంతీయ వలయ రహ దారి కోసం ఇప్పటికే 50 శాతం భూమి సేకరణ పూర్తైనట్టు సీఎం చెప్పారు .