HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారంరోజుల కస్టడీకి కోరింది ఏసీబీ. ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. బాలకృష్ణను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. రెరాలో శివ బాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏజంట్స్‌గా వ్యవహరించిన పలు వురు ఛోటామోట లీడర్లను గుర్తించేపనిలో పడ్డారు. మరోవైపు శివబాలకృష్ణ హయాంలో ఆమోదం పొందిన ఫైల్స్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. భూముల అక్రమాలపై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపేంచే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్దఎత్తున భూవి నియోగ మార్పిడిపై అధికారులు దృష్టి సారించారు. ఉత్తర్వులు వెలువడే సమయానికి హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా శివబాలకృష్ణగా లేకపోయినప్పటికీ ఫైల్స్ ఆమోదంపై ఆయన పాత్రను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలు స్తోంది.