హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నిబంధనలకు విరుద్దంగా హరికృష్ణను సస్పెండ్ చేశారన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవిం చింది. హరికృష్ణ సస్పెన్షన్ అనంతరం ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి ఆధా రాలు సమర్పించకపోవడంతో సస్పెన్షన్ ని ఎత్తేయాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఎవిడెన్సులు లేకుండా ఓఎస్డీని మంత్రి సస్పెండ్ చేసే అధికారం ఉండదని తేల్చిచెప్పింది హైకోర్టు.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకి హైకోర్టులో ఊరట లభించింది. గతేడాది ఆగస్టులో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఓఎస్డీ హరికృష్ణ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోప ణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కోరడంతో ఓఎస్డీ హరికృష్ణ ను సస్పెండ్ చేశారు మంత్రి. అయితే తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి తనను సస్పెండ్ చేశారని హైకోర్టులో హరికృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ అనంతరం వేసిన కమిటీ విచారణలో ఆరోపణలు రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ఎత్తివే స్తున్నామని హైకోర్టు తెలిపింది. తన వివరణ కోరకుండానే అన్యాయంగా సస్పెండ్ చేశారని.. కోర్టులో తనకు న్యాయం దక్కిందన్నారు ఓఎస్డీ హరికృష్ణ. గతంలో స్పోర్ట్స్ స్కూల్లో సీట్ల విషయంలో చాలా మంది ప్రభుత్వ పెద్దలు తనను ఒత్తిడి చేశారన్నారు. కానీ ప్రతిభ ఉన్న గ్రామీణ స్థాయి విద్యార్థులకే సీట్లు కేటా యించడంతో తనపై కక్ష్య గట్టి ఆరోపణలు చేశారని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు హరికృష్ణ నిబంధనలకు విరుద్దంగా హరికృష్ణను సస్పెండ్ చేశారని.. దీన్ని గమనించిన హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింద న్నారు అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి..లైంగిక ఆరోపణలపై వేసిన కమిటీ రిపోర్ట్ లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హరికృష్ణను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.మొత్తానికి ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్ నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌ను ఆయన కోరుతు న్నారు.


