ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో అనేక కీలకాంశాలను పొందుపరచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ప్రధానంగా సహజీవ నం అంశానికి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో ఎవరైనా సహజీవనంలో ఉండాలనుకుంటే వారు తప్పనిసరి గా తమ సంబంధాన్ని రిజిస్టర్ చేసుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాదు…21 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న యువతీ యువకులు సహజీవన విధానంలోకి రావాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని బిల్లులో స్పష్టం చేశారు. ఇదిలాఉంటే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయడం ఏమాత్రం కుదరదని ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో స్పష్టం చేశారు. అలాగే సహజీవనానికి సంబంధించి మరో నిబంధనను కూడా ప్రవేశపెట్టా రు. సహజీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా లేదా మైనర్ అయినా లివ్ ఇన్ రిలేషన్‌పిప్‌ను రిజిస్టర్ చేసే ప్రసక్తే ఉండదని ఉమ్మడి పౌర స్మృతి బిల్లులో కుండబద్దలు కొట్టారు.
సహజీవనం రిజిస్ట్రేషన్ అంశానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి ఉత్తరాఖండ్ అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్ వ్యవహా రాల బాధ్యతను ఇక నుంచి జిల్లా రిజిస్ట్రార్‌కు అందచేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. సహజీవనానికి సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.సహజీవనం చేయదలచుకున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే అవసరమనుకుంటే సహజీవనం చేయదలచుకున్న ఇద్దరినీ ఆఫీస్‌కు పిలిపించి రిజిస్ట్రార్ విచారించవచ్చని బిల్లులో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ సహజీవనాన్ని రిజిస్టర్ చేసుకోవడా నికి సదరు జంట నిరాకరిస్తే, అందుకుగల కారణాలను రాతపూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని బిల్లులో సూచించారు.
సహజీవనం కోసం పెట్టే అప్లికేషన్‌లో ఏమైనా అంశాలు అనుమానాస్పదంగా ఉంటే పోలీసు విచారణ కోరే అధికా రాన్ని రిజిస్ట్రార్‌కు అప్పగించింది ఉమ్మడి పౌర స్మృతి బిల్లు. సహజీవనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే, పాతిక వేల రూపాయల జరిమానా విధించవచ్చు. అలాగే ఆర్నెల్లపాటు జైలుశిక్ష విధించవచ్చు. అలాగే సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే మూడు నెలల జైలు విధించవచ్చు. అంతేకాదు పాతిక వేల రూపాయల జరిమానా కూడా విధించవచ్చు. సహజీవనానికి సంబంధించి బిల్లులో ఒక విశేషం పొందుపరిచారు. సహజీవనంలో జన్మించిన పిల్లల కు చట్టబద్దమైన హక్కులు లభిస్తాయి. అంటే సహజీవనానికి ఉమ్మడి పౌరస్మృతి చట్టపరమైన గుర్తింపు ఇచ్చినట్లే. ఇదొక విప్లవాత్మకమైన ప్రతిపాదన అంటున్నారు అభ్యుదయవాదులు. అలాగే సహజీవనంలో ఉన్న మహిళల ఆస్తి హక్కులకు పూచీకత్తుగా బిల్లును రూపొందించారు. సహజీవనంలో భాగస్వామి విడిచి పెడితే సదరు మహిళ, భరణం కోరవచ్చని బిల్లులో స్పష్టం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ బిల్లులో బహు భార్యత్వం, బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించారు. అన్ని మతాలలోని ఆడపిల్లలకు ప్రామాణిక వివాహ వయస్సు.. విడాకుల కోసం ఏకరీతి ప్రక్రియ వంటి ప్రతిపాదనలను బిల్లులో పొందుపరిచారు. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాలా, ఇద్దత్ వంటి పద్ధతులపై నిషేధాన్ని కూడా ఈ బిల్లులో చేర్చారు.


