వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌కు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా చోటు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేయడానికి వైఎస్ షర్మిలకు ఉన్న ఇమేజ్ పనికొస్తుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిలకు ఏ పదవి లభిస్తుంది ? ఏ బాధ్యత అప్పగిస్తారన్న చర్చ తాజాగా తెరమీద కు వచ్చింది. పదవుల సంగతి ఎలాగున్నా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీ యాలు మలు పు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల పార్టీ విలీనం పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థ కంగా మారింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సెగ్మెంట్ కూడా గెలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా చోటు దొరక డం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేయడానికి వైఎస్ షర్మిలకు ఉన్న ఇమేజ్ పనికొస్తుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి షర్మిలక కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుం దన్న ప్రచారం కూడా నడుస్తోంది. కడపలో ఎంపీ మిథున్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత నెలకొందని రాజకీయవర్గాల సమాచారం. దీంతో కడప నుంచి షర్మిలను పోటీ చేయిస్తే గెలుపు ఈజీ అని ఏఐసీసీ లెక్కలు వేసుకుంటోంది.
వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి మరో ఊహాగానం కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కే సమరసింహా రెడ్డి మధ్యవర్తిత్వం నెరపినట్లు తెలు స్తోంది. మరోవైపు షర్మిలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశంపై చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, ఫలితంగా తమకు వచ్చే నష్టమేమీ లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తు న్నాయి. షర్మిలను ఇక నుంచి తాము ప్రతిపక్షంగానే చూస్తామన్నారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బా రెడ్డి. మొత్తం మీద కాంగ్రెస్‌లో షర్మిల చేరడంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.