Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

వైసీపీ అభ్యర్థుల మార్పుల్లో గందరగోళం

         2024 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ.. వైసీపీలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులే కాదు. కార్యకర్తలు కూడా వైసీపీ అధినేత, సిఎం జగన్ మోహన్ రెడ్డి చేప డుతున్న మార్పులు, చేర్పులతో ఆందోళలలో ఉన్నారు. ఒక చోట అభ్యర్థిని మార్చడం… మళ్ళీ అక్కడే కొత్త వారికి అవకాశం ఇవ్వడం…ఇది అలవాటుగా మారింది. ఒక జాబితాలో ఇంఛార్జి బాధ్యతలు వచ్చిన వారికి…. తరువాత జాబితాలో చోటు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకూ వైసీపీ లో ఈ అయోమయం దేనికి….పార్టీ అధినేత జగన్ కే క్లారిటీ లేదా… ఓటమి భయమే.. ఈ మార్పులకు కారణమా…

      వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాల్లో మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు ఐదు జాబితాలను ప్రకటిం చింది వైసీపీ. ఈ ఐదు జాబితాలో 75 నియోజక వర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో అరవై ఒక్క చోట్ల ఎమ్మెల్యే అభ్య ర్థులను మారిస్తే, 14 చోట్ల ఎంపీ అభ్యర్థులను మార్చారు. తాజాగా వైసీపీ ఐదో జాబితా విడుదల అయింది. అందులో మచిలీపట్నం పార్లమెంట్ ఇంఛార్జి గా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ పార్లమెంట్ ఇంఛార్జి గా చలమలశెట్టి సునీల్ కి బాధ్యతలు ఇచ్చారు. తిరుపతి ఇంఛార్జి గా తిరిగి సీటింగ్ ఎంపీ గురు మూర్తి ని నియమించారు. నరసరావు పేట పార్లమెంట్ ఇంఛార్జి బాధ్యతలు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చారు. అవనిగడ్డ అసెంబ్లీ బాధ్యతలు, సింహాద్రి చంద్ర శేఖర్, సత్యవేడు బాధ్యతలు నుకతోటి రాజేష్, అరకువ్యాలీ ఇన్ చార్జి పదవి లింగానికి అప్పగించారు.

       వైసీపీ మార్పులు, చేర్పుల లో గందరగోళం నెలకొంది. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ ఇలాంటి గందరగోళంలో పడలేదు. ఒక చోట కొత్త అభ్యర్థిని ప్రకటించాక తిరిగి అక్కడ వేరే వారికి అవకాశం ఇవ్వడం విచిత్రం. వైసీపీ ఐదో జాబితాలో ఇదే ప్రధానంగా కలిపిస్తోంది. అధిష్ఠానం నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో చేసిన ప్రయోగాలను మళ్లీ రివర్స్‌ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 3 అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చారు.అరకు అసెంబ్లీ బాధ్యతలు గతంలో అరకు ఎంపీ మాధవికి ఇచ్చారు. అక్కడ ఎంపీ మాధవి ని ఇంఛార్జి గా ప్రకటించడం పై స్థానిక నాయకత్వం నుంచి తిరుగుబాటు ఎదురైంది. మాధవిని ఇంఛార్జి గా కొనసాగిస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. దీంతో తాజాగా అక్కడ మత్స్య లింగం కు కు బాధ్యతలు అప్పగించారు. నాలుగో జాబితాలో తిరుపతి పార్లమెంట్ బాధ్యతలు ఎమ్మెల్యే కోనేటి అదిమూలం కి అప్పగించారు. తిరుపతి ఎంపీ గురు మూర్తి కి సత్యవేడు అసెంబ్లీ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఎమ్మేల్యే కోనేటి అదిమూలం వైసీపీ పై తిరుగుబాటు చేశారు. పార్టీ తీరు నచ్చని అదిమూలం టీడీపీ యువనేత లోకేశ్ ను కలిశారు. టిడిపి లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యారు. ఫలితంగా తిరిగి తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జి లను మార్చింది వైసీపీ.

      ఇక ఆరో జాబితా కూడ సిద్ధం చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న జాబితాలో మరికొన్ని నియోజక వర్గాల్లోనూ మార్పులు వుండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కర్నూల్ పార్లమెంట్ ఇంఛార్జి గా మంత్రి గుమ్మనూరి జయరామ్ ని నియమించారు. అయితే అయన ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో అక్కడ కర్నూల్ మేయర్ బి వై రామయ్యకు బాధ్యతలు అప్పగించే అవకాశం వుంది. కర్నూలు జిల్లా కే చెందిన ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అక్కడ కొత్తగా బిసి సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ కి అసెంబ్లీ ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు అలా పదవి ఇచ్చి ఇలా లాగేసుకు న్నారు. తాజాగా ఎమ్మిగనూరు ఇంఛార్జి గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ను నియమించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజక వర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ని పక్కన పెట్టి దద్దాల నారాయణ యాదవ్ కి ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో స్థానిక నాయకత్వం పార్టీ తీరు పై తీవ్ర అసంతృప్తితో వుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అక్కడ ఇంఛార్జి మార్పు పై కసరత్తు కొనసాగుతోంది.

      విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో విభేదించి, వైసీపీ వైపు చేరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో కేశినేని నాని కి పోటీగా అతడి సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మరో కారణం. ఈ నేపథ్యంలో కేశినేని నాని రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ టికెట్ ఇస్తే.. కేశినేని నాని పార్లమెంటుకు గెలుస్తారా.. లేదా.. అని వైసీపీ అధినేత సర్వే చేయిస్తున్నారని తెలిసింది. ఎంపీ అభ్యర్థులను మారుస్తున్న జగన్ ..కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారా అన్న విషయంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోంది.

       వైసీపీలో తన మాట చెల్లకపోవడంతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తితో నిర్వేదంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలన్న బాలినేని మాటను వైసీపీ అధిష్టానం పెడచెవిన పెట్టింది. దీంతో పార్టీ ప్రయోజనం కోసమే తాను ఈ విషయం మాట్లాడానని, వైసీపీ అధినేతకు కానీ, ఇతర నాయకులు. కార్యకర్తలకు కానీ పట్టని పక్షంతో తనకెందుకని నిర్లిప్తత వ్యక్తం చేశారు. మొత్తం మీద సీఎం జగన్ అభ్యర్థుల మార్పు లు , చేర్పుల తో ప్రతి పక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, తిరుగుబాటు బాట అందుకోవడంతో పార్టీ అధినేత జగన్ కి చుక్కలు కన్పిస్తున్నాయి. కొందరు పార్టీ కి గుడ్ బై అంటుంటే… కొందరు సీఎం జగన్ పై ఒత్తిడి తెచ్చి మరీ అభ్యర్థులను మార్పించుకుంటున్నారు. సీఎం జగన్ కూడా పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం హాట్ టాపిక్ గా మారింది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్