ఆ ఎమ్మెల్యే అసంతృప్తికి కారణమేమిటి.. నియోజక వర్గంలో కొద్ది రోజులు యాక్టివ్ గా ఉంటారు…మరి కొన్ని రోజులు దూరంగా ఉంటారు. పార్టీలోనే ఉంటా.. రాజకీయాల్లో ఉన్నంతకాలం మా అధి నాయకుడితోనే నా ప్రయాణం అంటూ మాట్లాడు తూనే సమకాలీన రాజకీయాలు చేయలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు చర్చగా మారింది.
మైలవరం అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తీరు ఫై పార్టీలో చర్చ నడుస్తోంది. తమ పార్టీ నుంచే పోటీ చేస్తారని అధికార పార్టీ నాయకులు అంటుంటే.. లేదు… లేదు.. మా పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే అసలు పోటీ చేస్తారా? చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ అనే విషయం ఆయన నోరు తెరిచి చెబితే తప్ప తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. నియోజక వర్గంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం చేస్తే సరిపోద ని, అభివృద్ధి కూడా చేయాలని… నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజలు తనను ప్రశ్నిస్తున్నారని మాట్లాడారు. తన రాజకీ య భవిష్యత్ ను కూడా కాలమే నిర్ణయిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యల పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైసీపీలో ఉంటారా లేక టీడీపీలో చేరతారో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది.
కొద్ది కాలంగా వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ ఫై అసంతృప్తిగా ఉంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొం టున్న ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. విజయవాడ నడి బొడ్డున నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నా వసంత కృష్ణ మాత్రం దూరంగా ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్ల సందర్భంగా ఎక్కడా కూడా ఒక కార్యక్రమం నియోజక వర్గంలో నిర్వహించలేదు. జగన్ పుట్టిన రోజు వేడుకులకు కూడా దూరంగా ఉన్నారు. ఈ విధంగా తన నిరసన ను ఇండైరెక్ట్ గా వ్యక్తపరుస్తున్నారు. ఎమ్మెల్యే వసంత తీరు ఫై అయోమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయ కులు ఉంటే, టీడీపీ నాయకులు కొత్త రకం చర్చ ను లేవనెత్తారు. టీడీపీ మైలవరం అభ్యర్థిగా వసంత పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ ప్రధాన నాయకులు కూడా ఇదే విషయం వారి కార్యకర్తల వద్ద ప్రస్తావిస్తున్నారు. వస్తున్న వార్తలను వసంత కృష్ణ ప్రసాద్ కానీ, ఆయన అనుచరులు ఎక్కడా ఖండించడం లేదు. పైకి మైలవరం నుంచే పోటీ చేస్తానని చెబుతున్న వసంత కొద్ది రోజులుగా చిలకలూరుపేట కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నా యి. టీడీపీ అది నాయకత్వంతో ఇప్పటికే చర్చలు కూడా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కన్పిస్తున్న పరిణామాల నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్ మధ్యదూరం పెరిగిందన్నది వాస్తవం. కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేస్తారా.. చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు వల్ల ఎన్నికలకే దూరంగా ఉంటారా అనే విషయం తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. అప్పుడే చర్చకు తెరపడేది.


