వివాహితను సినీఫక్కీలో ముగ్గురు మహిళలు అపహరించి కారులో తీసుకెళుతుండగా అప్రమత్తమైన పోలీ సులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేస్తోందని గోకవరానికి చెందిన ఓ వివాహితపై కొవ్వూరుకు చెందిన మహిళ అనుమానం పెంచుకుంది. ఆమెను ఏదో ఒకటి చేసి కక్ష తీర్చుకోవాలని తన గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి కారులో గోకవరం చేరుకుంది. అక్కడ మరో మహిళ సాయం తీసుకొని వివాహిత ఇంటి సమీపంలో కాపు కాసి, అటుగా వెళుతున్న ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్దే ఉన్న వివా హిత భర్త జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన ఎస్సై నాగరాజు.. టెక్నాలజీ ఆధారంగా కారు ఉన్నచోటును కనుగొని అక్కడకు చేరుకొన్నారు. నిందితుల చెర నుంచి వివాహితను విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు ముగ్గురు మహిళలపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.