24.4 C
Hyderabad
Saturday, March 7, 2026
spot_img

విమాన బుకింగ్‌లను తెరవండి…..మాల్దీవుల అభ్యర్థన

         మాల్దీవుల పర్యాటక రంగానికి అత్యంత పెద్ద వనరు భారత దేశం. అయితే ఇటీవల మోదీ లక్ష ద్వీప్ పర్యటనతో మోదీపై మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల కారణంగా భారత పర్యాట కుల నుంచి మాల్దీవుల పర్యాటక రంగం బాయ్‌కాట్ తోపాటు తీవ్ర నిరసన ఎదురైంది. దీంతో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌ మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపేసింది. దీనిపై మాల్దీవుల టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్ల సంఘం ఆవేదనను వ్యక్తం చేసింది. తమ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు విచారకరమని, వాటిని పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ సంస్థను అభ్యర్థించింది. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, తమ దేశానికి విమాన బుకింగ్‌లకు అవకాశం కల్పించాలని మటాటో లేఖ రాసింది.

      తొలినాళ్ల నుంచి ఇరు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని మటాటో తెలిపింది. మా దేశం ఇండియన్స్ ను సొంత వారిగా భావిస్తుందని లేఖలో స్పష్టంగా పేర్కొంది. తమ పర్యాటక రంగంలో భారతీయులే అత్యంత కీలకమని ఈ సంర్భంగా వెల్లడించింది. ఈ నేతల వ్యాఖ్యలను ఆ దేశ పర్యాటక పరిశ్రమ సంఘం వెంటనే ఖండించిన వివషయం అందరికీ తెలిసిందే. భారత్‌ తమకు స్థిరమైన, అత్యంత కీలకమైన పర్యాటక వనరుని మాటీ ప్రకటించింది. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్‌ ప్రమాదం తర్వాత మాల్దీవులు కోలుకోవడానికి భారత దేశం ఎంతో సాయం చేసిందని ఈ సందర్భంగా మాటీ పేర్కొంది. తమ దేశంలో సంభవించిన ప్రతి సంక్షోభంలోనూ భారత్ తమ వెంట నిలిచిందని, నిలుస్తోందని ఆశిస్తున్నట్టు లేఖలో స్పష్టం చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్