విపక్షాలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయా ? మోడీ సర్కారుకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులా ? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యవహారంలో ఈడీ దూకుడు చూస్తుంటే ఇవే అనుమానాలు తలెత్తున్నాయా ? ఇలా ఒకటీ రెండు కాదు.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రానున్న రోజుల్లో ఖర్గే చెప్పిందే జరగబోతోందా అన్న సందేహా లు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరోసారి విక్టరీ కొట్టి హ్యాట్రిక్ సాధిం చాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆరాటపడుతుంటే… ఈసారైనా కమలదళాన్ని ప్రత్యేకించి మోడీని నిలువరించా లని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆ దిశగా ఎవరికి వారే ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. వ్యూహాలు పన్ను తున్నారు. ఇక, ఎన్నికల వేళ విపక్షాలను టార్గెట్ చేసుకొని మరీ కేంద్రం వేధిస్తోందన్న విమర్శలు, ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ విషయంలో ఈడీ వ్యవహార శైలి ఉందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. నాటకీయ పరిణామాల మధ్య అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన హేమంత్ సోరెన్‌ను విచారించింది ఈడీ. భారీ భద్రత నడుమ రాంచీ వచ్చిన ఈడీ బృందా లు హేమంత్ సోరెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇక, మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవిం ద్ కేజ్రీవాల్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులిచ్చినా హాజరు కాలేదు కేజ్రీవాల్. దీంతో మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని పేర్కొంది ఈడీ. ఈసారి కూడా కేజ్రీవాల్ విచారణకు రాకపోతే వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.అయితే.. ఈడీ సమన్ల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా నేతలు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్నికల వేళ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులను కావాలనే ఇలా వేధించి ఎన్నికల్లో లాభం పొందాలని, తమ దారికి తెచ్చుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు.
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధానంగా విపక్షాలకు, అది కూడా కేంద్రానికి కొరుకుడు పడని నేతలపై ఇలా నోటీసుల పేరుతో ఈడీ విరుచుకుపడడాన్ని తప్పుపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశంలో ఇటీవలె ఏఐసీసీ చీఫ్ ఖర్గే కామెంట్లను ప్రస్తావిస్తున్నారు. భువనేశ్వర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే..పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభకు ఇవే చివరి ఎన్నికలని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మరోసారి ప్రధానిగా మోడీ ఎన్నికైతే ప్రజాస్వామ్యం సంగతి అంతేనని వ్యాఖ్యానించారాయన. అంతే కాదు.. పుతిన్ మాదిరిగా జీవించినంతకాలం మోడీయే ఉండాలనే విధంగా వ్యూహం రచిస్తున్నారని ఆరోపించి సంచలనం సృష్టించారు ఖర్గే. విపక్షాలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆరోపించినట్లుగా కేంద్రంలో భాగస్వాములై ఉన్న, మోడీతో సత్సంబం ధాలు కొనసాగిస్తూ వివిధ స్కాముల్లో ఉన్న వాళ్లపై ఈడీ విచారణ నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొత్తంగా ఒకరి వెంట మరొకరికి అన్నట్లుగా ఆయా నేతలకు వస్తున్న ఈడీ నోటీసులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.