23.7 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

విద్యుత్ రంగంలో పొంచున్న ముప్పు శాస్త్రవేత్తల హెచ్చరిక

       బయోగ్యాస్.. ఇది మరో ప్రత్యామ్నాయ ఇంధన వనరు. వ్యర్థాలతో కూడా విద్యుత్ తయారు చేయవచ్చంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రక్రియలో కాలుష్యం అనే ముచ్చటే ఉండదు. ఎక్కువ‌గా పరిశ్రమల్లో వినియోగించే వ్యర్థాలతో బ‌యోగ్యాస్‌ను త‌యారు చేస్తారు.

  మనదేశంలో కనిపించదు కానీ, విదేశాల్లో చాలా చోట్ల బ‌యోగ్యాస్‌పై ఆధార‌ప‌డి వాహ‌నాలు న‌డుపుతుంటారు. మాము లు ఇంధ‌నాల వాడ‌కం వల్ల వ‌చ్చిన క‌ర్బన ప‌దార్ధాల కంటే ఇలా బ‌యోగ్యాస్‌తో విడుద‌ల‌య్యే వ్యర్థాలు 95 శాతం మేర త‌క్కువ‌గా ఉంటాయ‌ంటారు సైంటిస్టులు. ఒక్కమాటలో చెప్పాలంటే బయో గ్యాస్ పవర్‌తో పర్యావరణానికి మేలు జరిగినట్లే. ఏమైనా బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దేశంలో విద్యుత్‌ సంక్షోభం రాకముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని ఇంధనరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల గడ్డు రోజులను అంచనా వేసి ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్‌లో దేశంలో విద్యుత్‌ కొరత అనేది లేకుండా చూడాలంటున్నారు ఇంధనరంగ నిపుణులు.

     బొగ్గు కొరత నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ ఆయా దేశాల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌ను సన్నద్ధం చేసుకుంటున్నాయి. ఈ ప‌రిస్థితుల‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. దాహం వేసిన‌ప్పుడు బావి తవ్వడం కాకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టా లంటున్నారు విద్యుత్‌రంగ నిపుణులు.అనేక దేశాలు విద్యుత్ ఉత్పత్తికోసం కేవ‌లం బొగ్గు మీదే ఆధార‌ప‌డ‌టం మానేసి చాలా కాల‌మైంది. భారత్ మాత్రం ఇప్పటికీ న‌ల్ల బంగారాన్నే న‌మ్ముకుంది. ఈ వైఖ‌రి ఎంతమాత్రం మంచిది కాద‌ని హెచ్చరిస్తున్నారు ఇంధనరంగ నిపుణులు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై పాల‌కులు దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు నిపుణులు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహించాలి. ఆ దిశ‌గా పకడ్బందీ చర్యలు చేప‌ట్టాలి. అలా జ‌రిగిన‌ ప్పుడే, బొగ్గు నిల్వల్లో తేడాలు వ‌చ్చినా ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై ప‌డ‌దు. ఫ‌లితంగా దేశ ఆర్థిక వ్యవస్థ సేఫ్‌జోన్‌లో ఉంటుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్