మాజీ ఎమ్మల్యే జలీల్ ఖాన్ అంశం ఇప్పుడు విజయవాడలో హీట్ పెంచుతోంది. ఆయన టీడీపలోనే ఉంటారా? లేక వైసీపీ గూటికి చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఎన్నికల వేళ టికెట్ రాని నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. టిక్కెట్‌పై ఆశలు సన్న గిల్లిన నేతలు అలకపాన్పు ఎక్కుతున్నారు. నిన్నటి వరకూ ఆయా పార్టీల్ని విమర్శించిన నేతలు.. వాటి పంచన చేరేం దుకు సిద్దమవుతున్నారు. TDP నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జలీల్ ఖాన్ కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డిని కలవడం రాజకీయంగా సంచలనంగా మారింది. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ టికెట్‌పై టీడీపీ అధిష్టానం హామీ లేకపోవడంతో ఆయన పార్టీ వీడు తారని ప్రచారం జరుగుతోంది. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ గా వైసీపీ అధి ష్టానం అసిఫ్‌ను ఇప్పటికే నియమించింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన జలీల్‌ఖాన్… ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి ఆయన కూతురు బరిలో నిలవగా వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుండి టీడీపీలోనే కొనసాగుతున్న జలీల్… 2024 ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. అయితే, టీడీపీ టిక్కెట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో అలకబూనారు జలీల్. దాంతో వైసీపీకి గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు బెజవాడలో ప్రచారం జరుగుతోంది.మరోవైపు జలీల్ వ్యవహారంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేశినేని చిన్నిని రంగంలోకి దించింది. జలీల్‌ఖాన్‌తో కేశినేని చిన్ని భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంత నాలు చేశారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్‌ఖాన్ నివాసంలో ఆయనతో చిన్ని భేటీ అయ్యారు. పొత్తులలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ను జనసేనకు ఇస్తారని వస్తున్న ఊహగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేశినేని చిన్ని మంత్రాంగం ఫలించింది. రెండు రోజులలో టీడీపీ అధినేత చంద్రబాబుని..పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే ష్‌ని జలీల్ ఖాన్ కలవనున్నారు.