ఏపీ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయ్. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల గోదాలో గెలుపు గుర్రాలను దించేం దుకు పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. రాజకీయాల్లో చెప్పుకునే హాట్ నియోజకవర్గాలలో విజయవాడ కీలకం. విజయవాడ గడ్డ ఈసారి ఎవరికి అడ్డాగా నిలుస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.
అధికార పార్టీ వైసీపీ విజయవాడ అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. మరీ ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకర్గంపై కీలక పార్టీలు కదం తొక్కుతున్నాయి. ప్రత్యేకంగా సర్వే రిపోర్టుల ద్వారా అక్కడి ప్రజల నిర్ణయం ఎటువైపు ఉంటుందో అని అధికారపార్టీ అంచనాలకు సిద్ధమవుతోంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఓ స్పెషల్. ఇక్కడనుంచి 2014, 2019 లో వైసీపీ అభ్యర్డులు విజయం సాధిం చారు. 2014 లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ పోటీ చేసి టీడీపీ లోకి వెళ్ళటంతో 2019 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ని అదృష్టం వరించింది. అంతే కాక వెల్లంపల్లి కి మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో విజయవాడ వెస్ట్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అయితే, కొండ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. దేవాదాయ శాఖ మంత్రి గా అవకాశం వస్తే స్థానికంగా ఉన్న దుర్గ అమ్మవారి దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారని అనుకు న్నారు. దుర్గ గుడి అభివృద్ధి లో భాగంగా వేల కోట్లు అవినీతి జరిగిందని జనసేన పార్టీ అభ్యర్థి పోతిన మహేష్ ఆరోపిం చారు. ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనులు పేరుతో కోట్లు దోచుకున్నారని ప్రతిపక్ష పార్టీ లు విమర్శలు చేశాయి. స్థానికంగా ఉన్న దేవాలయంలో మంత్రిగారు చక్రం తిప్పడం అక్కడ ఈఓ లు ఎవరు వచ్చినా ఆయన కనుసన్నుల్లోనే పనిచేయాలనీ లేకపోతే ఊస్టింగ్ అవ్వాల్సిందేనని ప్రచారం జరిగింది.
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనకు మరొకసారి అవకాశం ఇస్తే వైసీపీ ని గెలిపించేది లేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తల కోసం ఏవిధంగానూ ఉపయోగప డకపోగా, కనీసం తమను పట్టించుకోలేదని ఆవేదనతో ఉన్నారు. గతంలో ఒక కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల వ్యాఖ్యల తో వెల్లంపల్లికి ఊరట వచ్చిందని అందరు అనుకున్నారు. విజయవాడ లో ప్రస్తుతం ఉన్న వాళ్ళని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకి పిలుపు నివ్వటంతో మరొకసారి మంత్రికే అవకాశం ఉందని వెల్లం పల్లి అనుచరులు భావించారు.
గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లో వెల్లంపల్లి శ్రీనివాస్ ని స్థానిక ప్రజలు నిలదీసిన విధానం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో నియోజకవర్గంలో వెల్లంపల్లి ఆశించిన స్థాయిలో పని చేయట్లేదని స్పష్టమైంది. విజయవాడ వెస్ట్ లో ముస్లిం ఓటు బ్యాంక్ తో పాటు వెల్లంపల్లి సామాజిక వర్గం కూడా అసంతృప్తి గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో తాజాగా తెరపైకి విజయవాడ వెస్ట్ లో ఒక బీసీ మహిళని నిలబెడతారని ప్రచారం జోరందుకుంది. అంతే కాక, సీఎంఓ నుంచి పిలుపు వచ్చినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తో విజయవాడ మేయర్ భాగ్య లక్ష్మి వెళ్ళటంతో ఈసారి వెస్ట్ లో మేయర్ ని దించుతారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది.
సీఎంఓ నుంచి బయటకి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా తో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల కోసం సీఎంఓకు వెళ్లవలిసి వచ్చిందని,అందుకే మేయర్ వచ్చారని తెలియచేసారు.”ఈసారి విజయవాడ వెస్ట్ లో పోటీ చేసేది నేనే” అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఖండించారు. మరి రాబో యే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమనియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుందో చూడాల్సిందే.