వైజయంతిమాల బాలి…భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్ స్టార్. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి, అక్కడ సత్తా చాటారు వైజయంతి. చెన్నైలో పుట్టి పెరిగిన వైజయంతి చిన్నతనంలోనే నృత్యం, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. పదహారేళ్ల వయసులో తమిళ సినిమా వజ్కై లో తొలిసారి ఆమె నటించారు. ఆ తరువాత తెలుగు, హిందీ సినిమాల్లోనూ వైజయంతి నటించారు. ప్రతిభావంతమైన నటిగా సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు.
హిందీ సినీఫీల్డ్ కు వెళ్లిన తక్కువ సమయంలోనే మహిళా సూపర్ స్టార్‌గా పేరు వైజయంత్రిమాల తెచ్చుకున్నా రు. అప్పట్లో హిందీ సినిమాల్లో ఆమె ఓ వెలుగు వెలిగారు. దిలీప్ కుమార్‌కు జోడీగా అనేక సినిమాల్లో నటించారు. నృత్య ప్రధానమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.వైజయంతిమాలకు తెలుగు సినీ ఫీల్డ్‌తో మంచి అనుబం ధం ఉంది. వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్ గజదొంగ వంటి అనేక హిట్ సినిమాల్లో వైజయంతిమాల నటిం చారు. వయస్సు మీద పడటంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు వైజయంతిమాల. అయితే ఇప్పటి కీ డ్యాన్సర్‌గా ఆమె కొనసాగుతున్నారు. వైజయంతిమాల…1968లో చమన్‌లాల్ బాలిని వివాహం చేసుకున్నా రు. వైజయంతిమాలకు పురస్కారాలు కొత్తకాదు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పుర స్కా రాలు అందుకున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డును కూడా ఆమె అందుకున్నా రు. సినీ, సంగీత రంగాలకు చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మవిభూషణ్‌కు వైజయంతిమాల ఎంపికయ్యారు. ఈ ఏడాది పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారిలో తమిళనాడుకు చెందిన ప్రముఖ భరతనాట్యం నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. 1943 ఫిబ్రవరి నాలుగో తేదీన పద్మా సుబ్రహ్మణ్యం మద్రాసులో జన్మించారు. ‘భారత నృత్యం’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు పద్మా సుబ్రహ్మణ్యం. ‘భారత నృత్యం’ నూటికి నూరు శాతం పద్మా సుబ్రహ్మణ్యం బుర్రకు పుట్టిన ఆలోచన.
పద్మా సుబ్రహ్మణ్యం కేవలం డ్యాన్సరే కాదు. నృత్యంలో విస్తృతంగా పరిశోధనలు జరిపారు అమె. పద్మా సుబ్ర హ్మణ్యం నృత్యాలు దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందాయి. పద్మా సుబ్రహ్మణ్యంపై అనేక మంది విదేశీ చలనచిత్ర నిర్మాతలు డాక్యుమెంటరీలు రూపొందించారు. పద్మా సుబ్రహ్మణ్యానికి 1981లో పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే 2003లో పద్మభూషణ్ పురస్కారం దక్కింది. సామాజిక సేవారంగంలో డాక్టర్ బిందేశ్వర్ పాఠక్‌కు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. డాక్టర్ బిందేశ్వర్ పాఠక్, ఓ సామాజిక సేనాని. మనదేశంలో పారిశుద్ధ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన విప్లవకారుడు ఆయన. టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా బిందేశ్వర్ పాఠక్ పాపులర్. ప్రజారోగ్యంలో ఓ సరికొత్త విప్లవం సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ.ఈ సంస్థ బిందేశ్వర్ పాఠక్ బుర్రకు పుట్టిన ఆలోచన.
మనదేశంలోని పారిశుద్ధ్య ఉద్యమంలో 1974 ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఏడాది తొలిసారి పాట్నాలో సులభ్ సౌచాలయ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఈ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్డి, మూత్రవిసర్జన, స్నానం చేసే సదుపాయాలుం టాయి . అంతేకాదు 24 గంటలూ సౌచాలయ కాంప్లెక్స్ తెరిచే ఉంటుంది. నామమాత్రపు రుసుము చెల్లించి ఈ సేవల ను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా సఫాయి కర్మచారీల జీవితాల్లో ఎనలేని మార్పు తీసుకువచ్చారు బిందేశ్వర్ ఠాకూర్. అలాగే పర్యావరణ పరిశుభ్రత, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియో గానికి బిందేశ్వర్ ఎనలేని కృషి చేశారు. ఈ నేపథ్యంలో 1971లో దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం.తాజాగా పద్మ విభూషణ్ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. కిందటేడాది ఆగస్టులో బిందేశ్వర్ ఠాకూర్ కన్నుమూశారు. మరణానంతరం బిందేశ్వర్ ఠాకూర్‌కు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.


