పవర్ స్టార్ పవనిజం కుర్రకారును ఎంతమేరకు ఆకట్టుకుందో అదే స్థాయిలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ బలమైన కాపుసామాజిక వర్గ నేతలను దూరం చేసుకుంటున్న పరిస్థితులు ఏపీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జన సేన పార్టీ కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లపై ఆధారపడి ఏపీలో అధికారం చేజిక్కింజుకోవాలనే లక్ష్యంతో వచ్చి నప్పటికీ, అది ఆచరణలో మాత్రం సాధ్యం చేసుకోలేకపోతుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి జనసేన అధినేత బలమంతా ఆయన కులమేననే వాదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే పవన్ సామాజిక నేపథ్యమే అంతో ఇంతో పరవు నిలబెడుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ ప్రతీ మీటింగ్ లో తనకు కులం మతం లేవని పదే పదే చెబుతుంటారు.అయినా తాను పలానా కులస్తుడినని మళ్లీ బాహాటంగానే చెప్తారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్ధం చేసుకోలేక తికమక పడుతున్నారు.
ఇదిలా ఉంటే కేవలం కాపు సామాజిక వర్గం ఓట్ల కోసమే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుందనేది జగమెరిగిన సత్యం. అయితే జనసేన అధినేత ఒక స్టాండ్ తీసుకోవడంలో విఫలమయ్యారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. టీడీపీ తో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే, పవన్ ను ఏపీకి సీఎం ను చేస్తామని అభిమానులు లేక పోలేదు. అయి నా పవన్ టీడీపీతోనే పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి? జనసేన అధినేత పవర్ స్టార్ రాష్ట్రంలో ఎవరి ప్రయోజనా లు కాపాడుతున్నట్టు అనే చర్చలు బహిరంగంగానే జరుగుతున్నాయి. కేవలం పవన్ కల్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తన మీటింగ్ వస్తారనే వాదనలు ఉన్నాయి. అయితే ఆ అభిమానం ఓట్ల రూపంలో బ్యాలెట్ బాక్స్ లో పడవనేది చాలాసార్లు అనుభవంలోకి వచ్చిన అంశమే. అయినప్పటికీ కాపుసామాజిక వర్గాన్ని చంద్రబాబుకు గంపగుత్తగా అమ్మేశారనే విమర్శలు సైతం పవన్ మూటగట్టుకు న్నా ..ఇంకా పవన్ పట్ల అభి మానం ప్రజలకు సన్నగిల్లడం లేదు. ఎప్పటికైనా పవన్ తనకంటూ ఒక స్టాండ్ తీసుకుం టారనే నమ్మకంతో కాపు సామాజిక వర్గం ఎదురు చూస్తోంది.
గతంలో పవన్ టీడీపీ పొత్తును వ్యతిరేకించే వాళ్లంతా వైసీపీ కోవర్టులేనని వ్యాఖ్యానించారు. దీంతో జనసేన పార్టీ లో బలమైన నాయకులు దూరమవుతున్నారనే వాదనుల ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టు కున్నా తనకు కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ఒప్పందం లేకపోవడం కూడా పవన్ అభిమానులను కలవర పెడు తోంది. మరో వైపు చంద్రబాబే పూర్తిస్థాయి ముఖ్యమంత్రని లోకేష్ చేసిన కామెంట్స్ జనసేనలో కాస్తో కూస్తో ఉన్న ఆశలు కూడా అడుగంటాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు చేజారుతన్నాయనే ఆందోళన పవన్ లో పెరిగిందని అభిమానులు అంటున్నారు. ఒకవైపు కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం , అలాగే వంగవీటి రాధా కృష్ణ వైసీపీలో చేరుతున్నారనే ప్రప్రచారం జోరుగా జరుగుతోంది. వీరిద్దరు వైసీపీలో చేరితే జనసేనకు భారీ దెబ్బ తగిలినట్టే నని, కాపుసామాజిక వర్గం చాలామట్టుకు దూరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నా రు. అంతేకాదు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు చీలిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.