లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో పై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ , అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ మేనిఫెస్టో సభ్యులు, మంత్రులు, పలు ప్రజా సంఘాలతో కేంద్ర మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రవీణ్ చక్రవర్తి చర్చించారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అందుకోసం మేనిఫెస్టోను సిద్దం చేసే ప్రక్రి యకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా, ఆచరణకు సాధ్యమయ్యే హమీలనే మేనిఫెస్టోలో పొందుపరచాలని నేతలు డిసైడ్ అయ్యారు. కర్ణాటక, తెలం గాణ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలకు అకట్టుకునేలా గ్యారంటీలను ప్రకటించాలని భావిస్తోంది. కర్ణా టక, తెలంగాణలో గ్యారంటీలు సక్సెస్ అయ్యాయి. ఇదే తరహాలో గ్యారంటీలను ప్రకటించడం ద్వారా దేశ ప్రజలంద రినీ ఆకర్షించాలని భావిస్తోంది.
ప్రధానంగా..రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. రైతు రుణ మాఫీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ససేమి రా అంటోంది. రైతు కిసాన్ సమ్మాన్ నిధిని 6 నుంచి 10 వేలకు పెంచేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనికి కౌంటర్ గా రైతు రుణ మాఫీ హామీతో దూసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పాటు పది లక్షల రూపాయలవరకూ ఉచిత వైద్య చికిత్స, మహిళలకు ఆర్దిక చేయుత, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గిగా వర్కర్లకు ఆరోగ్య ఉద్యోగ భద్రత, ప్రతి పేద కుటుంబానికీ ఆర్దిక సహాకారం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హమీ చట్టం, పంట లకు గిట్టుబాటు ధర, అగ్నివీర్ పథకం రద్దు వంటి హామీలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది.
ఇక రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని, అందుకు తగ్గవిధంగా హమీలు ఇవ్వాల ని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటి భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏలా ఉన్నాయి? అక్కడి ప్రజలు కాంగ్రెస్ నుంచి ఏమి ఆశిస్తున్నారు అన్న అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఏపీ, తెలంగాణల కోసం విభజన హమీల అమలు గ్యారంటీ ప్రామిస్ ను మానిఫెస్టోలో పొందు పరచాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రాల వారీగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 తో ముగుస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే ఛాన్స్ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఆ లోగానే.. మేనిఫెస్టో ను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.