లాంగ్‌డ్రైవ్ దాష్టీకం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పదిమంది నిందితులు రెండు రోజులుగా పరారీలో ఉన్నారు. లాంగ్ డ్రైవ్ కార్స్ కంపెనీ నిర్వాహకుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకున్నందుకు ఉద్యోగులపై ప్లాన్ ప్రకారం కిడ్నాప్ దాడి. ఈ సంఘటన ఉద్యోగులను ఉలిక్కిప డేలా చేసింది.
హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగులపై లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం విచక్షణారహితం గా దాడి చేశారు. తమ సంస్థలో పనిచేసి కొత్తగా స్టార్టప్ పెడుతున్నారనే కోపంతో లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకులు వారిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. యోగి అనే యువకుడు, రిషిత అనే యువతి ఇటీవల లాంగ్ డ్రైవ్ కార్స్లో జాబ్ మానేసి… మరో కంపనీలో జాయిన్ అయ్యారు. లాంగ్ డ్రైవ్ కార్స్లో వివిధ హోదాల్లో పని చేసే… సాయి తరుణ్, సమీర్, ఓబెర్ అనే యువకులు ఇటీవల యోగి, రిషితతో భేటీ అయ్యారు. కొత్తగా స్టార్టప్ పెట్టాలనే ఆలోచన చేశారు. ఇదే సమయంలో లాంగ్ డ్రైవ్ కార్స్ కు సంబంధించిన కొంత మంది మూడు కార్లల్లో వచ్చి కిడ్నాప్ చేసి.. ఒక గోడౌన్ కు తీసుకెళ్లారు. గంటల తరబడి అక్కడే ఉంచి వారిని చిత్రహింసలకు గురి చేసారు. వీరు తమ కంపెనీ పక్షాన కాకుండా వేరే వారికి ప్రమోషన్స్ చేస్తున్నారని.. విచక్షణారహితంగా దాడి చేశారు. తెల్లారి ఇద్దరి అమ్మాయిలను వదిలే సారు. మిగతా నలుగురిని అక్కడే బంధించి ఉంచారు. రెండు రోజుల తరువాత వారిని వదిలేసారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


