మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయా ణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. బస్సులు కెపాసిటీకి మించి వెళ్తున్నాయి. దాంతో బస్సులు తరుచూ మరమ్మతు లకు గురవుతున్నాయంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. కేఎంపీఎల్ కూడా రావడం లేదంటున్నారు. ఖర్చుల భారం భరించలేమంటూ ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అవుతున్నారు.
మరోవైపు అద్దె బస్సు ఓనర్ల సమస్యల మీద ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. అద్దె బస్సు ఓనర్లు రేపటి నుంచి సమ్మె కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2773 అద్దె బస్సులు ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణంతో పెరిగిన ప్రయాణీకుల రద్దీ పెరిగింది. దాంతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకంతో గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగడంతో బస్సుల నిర్వహణ భారంగా మారింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లడంతో టైర్లు వేడెక్కి పేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బస్సులకు కొత్త టైర్లు బల్క్ రేట్లకే అందించాలని బస్ ఓనర్లు కోరుతున్నారు. కేఎంపీఎల్‌ను తగ్గించి చార్జీలు ఇవ్వాలని అంటున్నా రు. బస్సులో పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో క్లెయిమ్‌కు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.