రాజస్థాన్ లోని జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ రేంజ్ భారీ పేలుళ్లు, చప్పట్లతో దద్దరిల్లింది. వాయు శక్తి -24 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన విన్యాసాల్లో తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శిం చింది. తన ఫైర్ పవర్ ను, దాడి సామర్థ్యాన్ని మరో సారి రుజువు చేసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ . ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ముఖ్య అతిథులుగా హాజ రయ్యారు.శనివారం జైసర్మేర్ వద్ద రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు గంటల వ్యవధిలో సుమారు 50 టన్నుల ఆయుధాలను ప్రయోగించి వైమానిక దళ శక్తిని చూపారు. ఈ కార్యక్రమం నిజంగా ఐఎఎఫ్ ప్రాణాంతక దాడి సామర్థ్యానికి, ఖచ్చితమైన లక్ష్య సాధన సామర్థ్యానికి అద్దంపట్టింది. మూడు చేతక్ హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని, వైమానిక దళ చిహ్నాన్ని ఎగురవేయడంతో కార్యక్రమం ప్రారం భమైంది, బ్యాక్ గ్రౌండ్ లో జాతీయ గీతం ఆలపిస్తూ గ్రాండ్ స్టాండ్ ను దాటింది. ఆ తర్వాత రాఫెల్ విమానం రూపొందించిన ‘సోనిక్ బూమ్’ను కళ్లను మినుమిట్లు కొలిపింది. తక్కువ స్థాయిలో ఎగురు తున్న రెండు జాగ్వార్ విమానాలు రాఫెల్ ను అనుసరిస్తూ ఈ ప్రాంతంలో అద్భుతాన్ని సృష్టించాయి. వైమానిక విన్యాసాల థీమ్.. ‘లైటనింగ్ స్ట్రైక్ ఫ్రమ్ ది స్కై’లో 120కి పైగా విమానాలు పగలు, రాత్రి వేళల్లో ఎల్ఏఎఫ్ దాడి సామర్థ్యాలను ప్రదర్శించాయి. భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్, సు-30 ఎంకేఐ, మిగ్-29, మిరాజ్-2000, తేజస్, హాక్ వంటి యుద్ధ విమానాలు భూమిపై, గాలిలోని శత్రు లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి ధ్వంసం చేశాయి.