అసోం రాజధాని గువాహటిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. అసోం రాజధాని గువాహటిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. గువాహటి నగరంలో జోడో యాత్ర జరిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో రాజధాని ఎంట్రీ పాయింట్ వద్ద ఘర్షణ జరిగింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ యాత్ర గువాహటి గుండా వెళ్లేందుకు అనుమతించరాదని పోలీసులను ఆదేశించారు. సిటీలో కాంకుండా గువాహటి బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలను సూచించారు. కాగా సెంట్రల్ గువాహటిలో యాత్ర జరిపి తీరతామని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.


