27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

రాహుల్ న్యాయ యాత్రకు మణిపూర్ సర్కార్ అనుమతి

         ఎట్టకేలకు రాహుల్ జరపతలపెట్టిన న్యాయ్‌యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముందుగా అనుమతి లేదని తెగేసి చెప్పిన మణిపూర్ ప్రభుత్వం చివరకు మనస్సు మార్చుకుంది. అంతి మంగా రాహుల్ యాత్ర కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది బీరేన్‌ సింగ్ ప్రభుత్వం. దీంతో యాత్ర నిర్వహణలో కాంగ్రెస్ నాయకులు బిజీ అయ్యారు. మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న రాహుల్ యాత్ర వివాదం సుఖాంతమైంది.

           కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రకు చివరకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదట అసలు యాత్రకు అనుమతి ఇచ్చేదే లేదని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కుండబద్దలు కొట్టారు. అదేమంటే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. న్యాయ్‌ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ నేపథ్యంలో చివరకు మణిపూర్ ప్రభుత్వం మరో ఆలోచన చేసింది. చివరకు రాహుల్ గాంధీ న్యాయ్‌ యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.యాత్ర నిర్వహణకు సంబంధించి అనేక షరతులు విధించింది.

        న్యాయ్‌ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం చివరకు అనుమతి ఇవ్వడానికి ముందు హై డ్రామా నడిచింది. వాస్తవానికి మణి పూర్ రాజధాని ఇంఫాల్ ఈస్ట్ లో హప్త కంగ్జీబంగ్ ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈనెల 14న భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభం కావాలి. అయితే భారత్ న్యాయ్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా, న్యాయ్‌ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

       రాహుల్ గాంధీ చేపట్టాలనుకున్న న్యాయ్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేఘచంద్ర. ప్రజల మౌలిక హక్కులను మణిపూర్ ప్రభుత్వం కాలరాస్తోందని మేఘచంద్ర మండిపడ్డారు. దాదాపు పది రోజుల నుంచి అనుమతి కోసం మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కాంగ్రెస్ నాయకులు సంప్రదించారన్నారు. అయితే చివరి క్షణంలో శాంతి భద్రతల పరిస్థితిని సాకుగా చూపించి, న్యాయ్‌ యాత్ర కు అనుమతి ఇవ్వలేం అని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అనడం దారుణమన్నారు కాంగ్రెస్ నాయకులు.

ఇదిలా ఉంటే న్యాయ్‌ యాత్ర రాజకీయ యాత్ర కాదని వివరణ ఇచ్చారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె. వేణుగో పాల్. న్యాయ్‌ యాత్రను రాజకీయ యాత్ర చేయవద్దని మణిపూర్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయ్ యాత్ర, ఒక చారిత్రాత్మక యాత్ర అన్నారు వేణుగోపాల్. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం చేయడానికే రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేపట్టాలని సంకల్పించారని వేణుగోపాల్ స్పష్టం చేశారు. అయితే హప్త కంగ్జీబంగ్ ప్యాలెస్ గ్రౌండ్స్ నుంచి న్యాయ్‌ యాత్ర ప్రారంభించడానికి మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ తాము వెనక్కి తగ్గేది లేదన్నారు కాంగ్రెస్ నాయకులు. వేరే ప్రాంతం నుంచి న్యాయ్‌ యాత్ర ప్రారంభిస్తామన్నారు కే. వేణుగోపాల్‌.

         ఒకవైపు అయోధ్య రామ మందిర అంశంతో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంటే మరో వైపు ప్రతిష్టాత్మకంగా భావి స్తున్న భారత్ న్యాయ్‌ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే అంటు న్నారు రాజకీయ విశ్లేషకులు. అయోధ్యలో ఈనెల 22న కీలకమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య అంతా రామమయం అయింది. యావత్ భారతదేశం ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర అంశం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారుతుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ ప్రతిపాదించిన భారత్ న్యాయ్ యాత్రకు బీరేన్ సింగ్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్‌ వర్గాలను నివ్వెర పరచింది.

     గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడోయాత్ర సూపర్ డూపర్‌గా హిట్‌ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అదే జోష్‌‌ను కొనసాగిస్తూ, మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మరో యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేపట్టే యాత్రకు భారత్ న్యాయ్ యాత్ర అని పేరు కూడా పెట్టింది హస్తం పార్టీ. ఏమైనా భారత్ న్యాయ్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం నుంచి చివరకు అనుమతి ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. యాత్ర నిర్వహణలో ప్రస్తు తం కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసినట్లే భారత్ న్యాయ్ యాత్రను కూడా సక్సెస్ చేయాలన్న గట్టి పట్టుదలతో శ్రమిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

        గతంలో భారత్ జోడోయాత్ర సాగిన అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు పెరిగింది. అటు కర్ణాటక ఇటు తెలంగాణ …ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారత్ జోడోయాత్ర సాగింది. కర్ణాటకలో యాత్ర జరిగినప్పుడు సోనియా గాంధీ కూడా రాహుల్ వెంట నడిచారు. ఈ నేపథ్యంలో కిందటి ఏడాది జరిగిన కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో భారత్ న్యాయ్‌ యాత్ర సాగిన ప్రాంతాల్లోనూ తమ పార్టీ పట్టు పెంచుకుం టుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. రామమందిర అంశంతో భారతీయ జనతా పార్టీకి వచ్చే మైలేజీకి దీటుగా భారత్ న్యాయ్‌ యాత్రతో ప్రజల మద్దతు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏమైనా అంతిమంగా భారత్ న్యాయ్‌ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఆనందం నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్