22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

రాడార్ స్టేషన్ ఏర్పాటుపై పులుముకున్న రాజకీయ రంగు

           నౌకలు, జలాంతర్గాముల సిగ్నలింగ్ వ్యవస్థలో లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. పరిగి నియోజకవర్గం దామగుండం అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీకి చెందిన ఎల్‌ఎఫ్‌ఆర్‌ఎస్ నిర్మాణాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై ఇండియన్‌ నేవీ కమాం డర్‌ కార్తీక్‌ శంకర్‌తో సీఎం సమావేశం అయ్యారు. అటవీ ప్రాంతానికి, దామగుండం ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్ల కుండా ఈ ప్రాజెక్ట్ చేపడ్తామని నేవీ కమాండర్‌ కార్తీక్‌ శంకర్‌ తెలిపారు.

        వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఎల్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రాజెక్టు పురోగతిపై సచివాలయంలో ఇండియన్‌ నేవీ కమాండర్‌ కార్తీక్‌ శంకర్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్‌మోహన్‌రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు సజావుగా పూర్తి చేసేందుకు నేవీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యేరామ్‌మోహన్‌రెడ్డి కి రేవంత్ రెడ్డి సూచించారు. కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ అధికారులు సందీప్ దాస్, రాజ్ బీర్ సింగ్, మణి శర్మ, మనోజ్ శర్మ హాజరైన ఈ సమావేశంలో ఎల్‌ఎఫ్‌ఆర్‌ఎస్ నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలను, రాడార్ స్టేషన్ స్థాపన సానుకూల ప్రభావాన్ని నేవీ కమాండర్‌ కార్తీక్‌ శంకర్‌ వివరించారు. అటవీ ప్రాంతానికి, ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

         సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై స్పందించిన కార్తీక్‌ శంకర్‌… ఎల్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌ నిర్మాణం వల్ల అటవీ ప్రాంతానికి, దామగుండం దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. పరిగి ప్రాంతంలో నావికాదళ సౌకర్యాల నిర్మాణా నికి, అభివృద్ధి పెంపుదలకు, ఉపాధి అవకాశాలకు ఇది దోహద పడుతుందని కార్తీక్ శంకర్ పేర్కొన్నారు. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న అటవీశాఖ భూమి బదలాయింపు సమస్య తీరిపోయింది. దామ గుండం పరిధిలోని 2,900 ఎకరాల అటవీ భూములను నావికా దళానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలోనే మొదటి నేవీ రాడార్ స్టేషన్ 1990 లో తమిళనాడు తిరున్వేలిలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుండడంతో, ఇండియన్ నేవీకి తెలంగాణ కీలక స్థావరంగా మారనుంది. నౌకలు, జలాంతర్గాముల సిగ్నలింగ్ కు విఎల్ఎఫ్ స్టేషన్ ముఖ్య భూమిక పోషించనుంది.

    దామగుండం అటవీ ప్రాంతంలో నేవి రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తో నావికా దళాధి కారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చినా, అటవీశాఖ భూముల బదలాయింపులో తలెత్తిన కొన్ని సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో లైన్ క్లియర్ అయ్యింది. దీంతో, విశాఖ తూర్పు నావికా దళం రాడార్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనుంది. ఈ రాడార్ స్టేషన్ యూనిట్ లో 600 మంది నావికాదళ సిబ్బందితో పాటు, కొందరు సామాన్య పౌరులు ఉంటారు. స్కూల్స్, మార్కెట్లు, బ్యాంకులు ఏర్పాటై ఈ ప్రాంతం అభివృద్ధి కానుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేవి అధికారులు లక్ష్య నిర్దేశం చేసుకున్నట్టు తెలిసింది. అయితే, నేవి రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి చేటు వాటిల్ల వచ్చని కొందరు స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం దాదాపు 12 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని, దీనివల్ల అటవీ ప్రాంత సమతుల్యం దెబ్బ తింటుందని ఆవేదన చెందుతున్నారు. చెట్లతో పాటు అటవీ ప్రాంతంలోని ఎన్నో జంతువులకు, పశు పక్ష్యాదులకు ముప్పు ఏర్పడుతుందని భావిస్తున్నారు.

       ఇదేకాక రాడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు, గిరిజన తండావాసులకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికులు, పర్యావరణ ప్రేమికులు, రాజకీయ నేతలు కలిసి దామగుండం పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధమయ్యారు. రాడార్ స్టేషన్ ఏర్పాటును నిరసిస్తూ ఉద్యమించడానికి సిద్దమవుతున్నారు.ఎంపీ ఎన్నికలు సమీపిస్తూండడంతో రాడార్ స్టేషన్ ఏర్పాటుపై రాజకీయ రంగు పులుముకుం టోంది. బీఆర్ఎస్ నేతలు రాడార్ స్టేషన్ ఏర్పాటు ను వ్యతిరేకిస్తున్నారు. స్థానికులతో కలిసి తరచు దామగుండం సందర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటు ను వ్యతిరేకిస్తూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలను పర్యావరణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్