రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టెస్టు కెరీర్లో 11వ శతకాన్ని అందు కున్నాడు. 2 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో సెంచరీని సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఇండియన్ బ్యాట్స్ మెన్ గా ఘనత సాధించాడు. 33 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పో యిన దశలో రవీంద్ర జడేజాతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా..హిట్ మ్యాన్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన క్రమంలో భారత్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు చేరుకుంటున్నప్పటికీ రోహిత్ శర్మ తన వికెట్ ను కోల్పోకుండా నిలదొక్కుకుని సంచెరీ పూర్తి చేశాడు.