32.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

యెమెన్ పై విరుచుకుపడుతున్న క్షిపణులు

     పశ్చిమ ఆసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎర్రసముద్రం మరింత ఎరుపెక్కింది. అసలే ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణతో రగులుతున్న వేళ పశ్చిమ ఆసియాపై యుద్ధం కమ్ముకొచ్చింది. తాజాగా ఈ యుద్ధాన్ని రాజేసింది. అమెరికా , బ్రిటన్‌ వాటి మిత్రదేశాలు .. ఎర్ర సముద్రంపై ప్రయాణించే వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడుతున్న హౌతీ రెబల్స్ పై అమెరికా , బ్రిటన్ సైన్యాలు శుక్రవారం తెల్లవారు జామున ప్రతీకార దాడులు జరిపాయి. యెమెన్‌ లో ఈ సాయుధ ముఠాకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, క్షిపణుల దాడి జరుగుతోంది. రాజధాని సనాతోపాటు దాదాపు 16 చోట్ల 70 కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. వీటిలో హౌతీల గగన తల రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు ..డ్రోన్, క్షిపణుల నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు ఉన్నాయి. పలు నగరాల్లోని విమానాశ్రయాలు, ఇతర శిబిరాలపై దాడులు జరిగాయి.

       ఈ యుద్ధంలో దాదాపు వంద గైడెడ్ ఆయుధాలు ఉపయోగించినట్లు అమెరికా వాయుసేన ప్రకటించింది. ఈ దాడుల్లో బ్రిటన్ వైమానిక దళానికి చెందిన టైపూన్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ యుద్ధ ఫలితంగా ఐదుగురు చనిపోయారు.మరి కొంతమంది గాయపడ్డారు. దీనికి తగిన మూల్యం అమెరికా ,బ్రిటన్ లు చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఆ పై కొద్ది సమయానికే యెమెన్ లోని ఎడెన్ రేవుకు 90 నాటికల్ మైళ్ల దూరంలో హౌతీలు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర వాణిజ్య సంస్థ తెలిపింది.

        గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్రసముద్రం పై ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు. దీన్ని ఆపాలని వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు రెబల్స్ ను హెచ్చరించాయి. ఈ క్రమంలో మౌనంగా ఉన్న హౌతీలు మంగళవారం విరుచుకుపడ్డారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించారు. వాటిని అంతేవేగంగా అమెరికా బ్రిటన్ యుద్ద నౌకలు కూల్చేశాయి. మొత్తంగా చూస్తే గత ఏడాది నవంబర్ 19 నుండి ఇప్పటి వరకు ఎర్ర సముద్రంలో 27 దాడులకు హౌతీలు పాల్పడినట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి దాడులతో అప్రమత్తమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాతీయ భద్రతా బృందంతో సమావేశం అయ్యారు.

        ఇందులో హౌతీలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడానికి మార్గాలను వివరించారు.దీంతో రెబల్స్ పై ప్రతీకార దాడులకు దిగాలని, ఆసుసత్రిలో చికిత్స పొందుతున్న రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. దాంతో ఉన్నత స్థాయి ఆదేశాలను అనుసరించి, శుక్రవారం తెల్లవారు జామున అమెరికా యుద్ధ విమానాలు ..వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు దాడులకు ఉపక్రమించాయి. నౌకాదళ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలతోపాటు ఒక జలాంతర్గామి నుంచి తోమాహక్ క్షిపణులు హౌతీ స్థావరాల దిశగా దూసుకు వెళ్లాయి. ఈ క్రమంలో యెమెన్ రాజధాని సనా పేలుళ్లతో దద్దరిల్లింది. హౌతీల ఆధ్వర్యంలో రేవు పై బాంబులు పడ్డాయని , ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్