హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణం జరిగింది. పాలమూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సింగోటం రాము అనే వ్యక్తి గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. రాముపై ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రాము.. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటారు. దీంతో ఈ హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


