స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో(TELANGANA) ఎన్నికల హీట్ మొదలైంది. మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ సైతం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ సిద్దం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈనెల 21న కేసీఆర్ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. బీఆర్‌ఎస్ నుంచి సుమారు 80 నుంచి 90 మంది అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేసినట్టు సమాచారం. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌లు ఉన్నట్టు తెలుస్తోంది.