కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూమి వివాదమే ఈ దారుణ హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాణిక్యపూర్ గ్రామపంచాయతీలో ఉన్న రాజుగూడకు చెందిన ఆత్రం తిరుపతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తమకు అందిన సమాచారంతో పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుపతి హంతకుల కోసం డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.


