32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

మాట తప్పం. మడమ తిప్పం – ఏపీ సీఎం జగన్

ఏపీలో పెన్షన్ దారులకు శుభవార్త. మాట తప్పం. మడమ తిప్పం అని ఏపీసీఎం జగన్ మరో సారి నిరూపించారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి ముందే పెన్షన్ పండుగ వచ్చేసింది. ఈ సర్కార్ నెలవారీ పెన్షన్‌ను మూడు వేలకు పెంచి అందిస్తోంది. ప్రతిఏటా పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని అమలు చేశారు. వైయస్‌.జగన్. ఈ నెలనుంచి పెంచిన పెన్షన్ అమలుకు రాష్ట్రప్రభుత్వం అక్షరాలా 1968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో 2014-19 మధ్య గత పాలనలో పెన్షన్‌ నెలకు వెయ్యిరూపాయలు. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి పెన్షన్‌ను 2వేల250 రూపాయలకు పెంచారు. అదే 2022 జనవరి నుంచి 2వేల 500కు పెన్షన్‌ కు పెంచారు. 2023 జనవరిలో 2,వేల 750వరకూ పెన్షన్ పెరిగింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి 3వేల రూపాయలు అందుకుంటున్నారు పెన్షన్ దార్లు.

గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కేవలం నెలకు వెయ్యి రూపాయలే. ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఆ ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే. 2014 నుంచి ఐదేళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు 27వేల687 కోట్లు మాత్రమే. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పెన్షన్ పెరిగింది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఈప్రభుత్వం 66.34 లక్షల మందికి నెలకు సగటున 1968 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు ఏకంగా 83,526 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ పాలనలో పెన్షన్‌ లబ్ధిదారులు 39 లక్షల మంది ఉంటే, ఇప్పుడు 66.34లక్షల మంది పెన్షన్ అందుకుంటూ హాయిగా గడుపుతున్నారు.

గత పాలనలో పింఛన్‌కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ అందిస్తోంది. ప్రతినెలా ఠంచన్‌గా ఒకటో తేదీన పొద్దుటే తలుపుతట్టి గుడ్ మార్నింగ్‌ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్ధిదారులకు పెన్షన్ల్లు అందిస్తున్నారు. సెలవులు వచ్చినా, పండుగలు వచ్చినా.. పెన్షన్ పంపిణీలో మాత్రం జాప్యం ఉండదు.

గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్న కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు ఉండేవి. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే పెన్షన్. వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది.

నేడు, కులం లేదు.. మతం లేదు. వర్గాలు లేవు.. పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులే కుండా అర్హులందరికీ పింఛన్లు మంజూరవుతున్నాయి. అర్హులైన వారికి, ఏ కారణంచేతైనా లబ్ధి అందని పక్షంలో వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్‌, డిసెంబర్‌లలో బై యాన్యువల్‌ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్‌ ద్వారా పారద ర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్‌ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్‌, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌ కేటగిరీలొ ఒక్కో లబ్ధిదారునికి అందిన మొత్తం 58వేలు. ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం లక్షా ,47వేల500. గత ప్రభుత్వంలో కంటే 89వేల 500 రూపాయలు అదనం. పాత ప్రభుత్వం హయాంలో విక లాంగులు 5 ఏళ్లలో పెన్షన్‌ గా అందుకున్న మొత్తం 58వేల 500 రూపాయలు. ప్రస్తుతం వికలాంగుల పెన్షన్‌ అందు కున్న ఒక్కో లబ్ధిదారుడికీ లభిస్తున్న మొత్తం లక్షా 82 వేల రూపాయలు.. అంటే . గతం కంటే ఇది లక్షా 23వేల ,500 రూపాయలు అదనం.పెన్షన్ మూడు వేల రూపాయలకు పెరగడంతో లబ్ధి దారులు ఖుష్. మున్ముందు కూడా ఈ పెన్షన్ ఇలాగే అందే అవకాశం ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్