23.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

మహువా మొయిత్రా పై ఆరోపణల్లో నిజమెంత ?

          మహువా మొయిత్రా ఎపిసోడ్ ఇటీవల జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహువా మొయి త్రాను పార్లమెంటు నుంచి బహిష్కరించారు. అయితే తన వివరణ వినకుండానే ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారని మహువా మండిపడ్డారు. ఇదిలా ఉంటే మహువా ఎపిసోడ్ లోక్‌సభ ఎన్నికలనాటికి తృణమూల్ కాంగ్రెస్‌కు ఒక ఆయుధంగా మారబోతోంది.

        భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెం దిన లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై ఇటీవల బహిష్కరణ వేటు వేశారు. మహువా మొయిత్రా బహిష్క రణ ఎపిసోడ్‌కు ఒక నేపథ్యం ఉంది. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరారందానీ నుంచి మహువా మొయిత్రా రెండు కోట్ల రూపాయలకు పై నగదు, ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ఈ ఆరోపణలపై వినోద్ కుమార్ సోంకర్ నాయకత్వంలో నైతిక విలువల కమిటీని లోక్‌సభ ఏర్పాటు చేసింది. మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై నైతిక విలువల కమిటీ యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపింది. చివరకు మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని నైతిక విలువల కమిటీ నిర్థారించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అంతిమంగా ఎంపీగా మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేశారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.

     మనదేశంలో పార్లమెంటుకు ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారపక్ష సభ్యులతోపాటు ప్రతిపక్షాలపై కూడా ఉంది. ఇందులో మరో అభిప్రాయమే లేదు. ఉండకూడదు కూడా. డబ్బులు, ఖరీదైన బహుమతు లు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగేవాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం అంతకంటే ఉండకూడదు. అయితే మరణశిక్ష అమలు చేయడానికి ముందు కూడా , దోషికి తన వివరణ చెప్పుకునే అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ సొమ్ములు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మహువా మొయిత్రాకు మాత్రం సభలో తన మాట చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు స్పీకర్ ఓం బిర్లా.

       మహిళా బిల్లు గురించి జబ్బలు చరచుకునే కేంద్రప్రభుత్వం ఒక మహిళా ఎంపీ పట్ల వ్యవహరించిన తీరు ప్రశ్నార్థ కంగా మారింది. మహువా మొయిత్రా కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసులా మారారు. దీంతో ఉద్దేశ పూర్వకంగానే మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనే కాదు….. సామాన్య ప్రజల్లోనూ కలుగుతోంది. మహువా మొయిత్రా ఓ సీనియర్ రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహువా మొయిత్రా ఓ ఫైర్‌బ్రాండ్. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2016లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కరీంపూర్‌ నియో జకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ప్రవేశించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణానగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొయిత్రా గెలిచారు. ఎంపీగా తన తొలి ప్రసంగంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తొలి ప్రసంగంతోనే అందరి దృష్టి ఆకట్టుకున్నారు మొయిత్రా. అయితే మహువా మొయిత్రాకు వివాదాలు కొత్త కాదు. గతంలో కాళీ దేవిపై మహువా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహువా మొయిత్రా వ్యాఖ్యలు అప్పట్లో పశ్చిమ బెంగాల్లో దుమారం రేపాయి. దీంతో మహువా వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వ్యక్తి గత హోదాలోనే మహువా మొయిత్రా కాళీ దేవిపై వ్యాఖ్యలు చేశారని మమత వివరణ ఇచ్చుకున్నారు.వివాదాన్ని సద్దుమణిగింపచేయడానికి ప్రయత్నించారు.

      మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవు తున్నాయి. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లోక్‌సభ సభ్యత్వం రద్దు అంటే చిన్న విషయం కాదు. మహువా మొయిత్రాకు ఓటు వేసిన కృష్ణానగర్‌ నియోజకవర్గ ప్రజల భావోద్వేగాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్య త్వాన్ని రద్దు చేసే కీలక నిర్ణయాన్ని తీసుకునేముందు మహువా మొయిత్రా వివరణ విని ఉండాల్సిందని ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు. ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎన్నికల వరకు పశ్చిమ బెంగాల్‌లో మహువాపై వేటు అంశమే కీలకం అయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు నరేంద్ర మోడీ నాయకత్వం లోని బీజేపీ సర్కార్, బెంగాలీల పట్ల కక్ష పెట్టుకుందన్న ప్రచారం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటు న్నారు. మమతా బెనర్జీ ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఏమైనా ప్రతిపక్ష ఎంపీల విషయం లో నరేంద్ర మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలు పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహ రిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఆక్షేపిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్